ఆంధ్రప్రదేశ్‌

జగన్ తీరుతో వైకాపాకే నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 28: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరు కారణంగానే ఆ పార్టీకి నష్టం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. కర్నూలు నగరంలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అహంభావం కారణంగానే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారని తెలిపారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధి కోసం అందరినీ కలుపుకొంటూ ముందుకుపోతున్న తీరుతో ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావడానికి మార్గం ఏర్పడిందని వెల్లడించారు. జగన్ ఆవేశం, అహంకారం రాజకీయాలకు సరిపోవని, ఎదుటి వ్యక్తులను గౌరవించడం నేర్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. ఢిల్లీ యాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని, తమ ప్రభుత్వంలో అవినీతిపై ఆధారాలు సమర్పిస్తే తక్షణం అవినీతిపరులపై చర్యలు తీసుకుంటానని, అవసరమైతే మంత్రులపై కూడా కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి శాసనసభలోనే స్పష్టం చేశారన్నారు. అయితే జగన్ ఆధారాలు సమర్పించలేక ఢిల్లీలో గల్లీ, గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. జగన్ చెబుతున్న లెక్కల ప్రకారం అవినీతి సొమ్ము లక్షల కోట్లు దాటిందని దీన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఆధారాలుంటే బయట పెట్టాలే కానీ ఢిల్లీలో ఎవరిని కలిసినా ఒరిగేదేమీ లేదన్నారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని తన పత్రిక, ఛానల్‌లో పెద్దగా ప్రచారం చేసుకున్నారని, ఆ తరువాత వాటికి ఆధారాలు చూపలేక వౌనం వహించిన విషయాన్ని గుర్తు చేశారు.