ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు, కరవు కవలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కరవు కవల పిల్లలని, చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా కరవు కూడా వస్తోందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ కరవు పరిస్థితులు చోటు చేసుకొని ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదన్నారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నా ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి హెరిటేజ్ ఫ్యాక్టరీలో ఉన్న పాలను విక్రయించుకోవడానికి ఉపాధి కూలీలకు మజ్జిగ ఇస్తున్నారే తప్ప ప్రజలు తాగడానికి నీటిని అందించలేకపోతున్నారన్నారు. మూగ జీవులకు అవసరమైన పశుగ్రాసం లేక పాడి రైతులు అనేక అగచాట్లకు లోనవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తన అక్రమ సంపాదనతో కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ పోకడలతో ముఖ్యమంత్రి హీరో అవుదామనుకుంటన్నారని, అయితే వాస్తవానికి ఆయన జీరో అవుతారన్నారు.