ఆంధ్రప్రదేశ్‌

రాజకీయాల నుంచి వైదొలగుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 28: ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనారోగ్యకరంగా ఉన్నాయని ఈ పరిస్థితుల్లో తాను ఇమడలేక ఇక వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని పల్నాడు ప్రాంతం అనేక దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో అల్లాడుతోందని ఈ నేపథ్యంలో పల్నాడులోని 253 గ్రామాల్లో 6,04,208 మంది జనాభాకు అవసరమైన నీరందించేందుకు రూ. 1150 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేశామని వివరించారు. తగిన నిధులు అందుబాటులో లేనందున ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి సమస్య తీవ్రతను వివరించగా సానుకూలంగా స్పందించారన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై విలేఖర్లు ప్రస్తావించగా ఈ విషయంపై కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారని, తానేమీ స్పందించలేనని దాటవేశారు. తెలుగుదేశం పార్టీపట్ల అసంతృప్తితో ఉన్న మీరు బీజెపిలో చేరే అవకాశం ఉందా? అన్న మరోప్రశ్నకు ఎంపీ రాయపాటి స్పందిస్తూ ఇప్పటికే చేరిన పలువురు నాయకులు ఖాళీగా ఉన్నారని తాను చేరిమాత్రం ఏ ప్రయోజనమని బదులిచ్చారు. ఇదిలా ఉండగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నరసరావుపేట నియోజకవర్గంలో నిర్వహించే పర్యటనకు రాయపాటి దూరంగా ఉన్నట్లు సమాచారం.