ఆంధ్రప్రదేశ్‌

ఫిరాయింపులపై ప్రజల్లో అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 28: వరుస కట్టి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల తీరుతో ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో పోలింగ్‌పై చూపే ప్రమాదం ఉందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఒక పార్టీ గుర్తుపై విజయం సాధించి ఆ తరువాత ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడకుండా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారే కానీ వారు చెబుతున్నట్లు నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల అభిప్రాయం ఏ మాత్రం కాదని అత్యధిక మంది ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు ఒక పార్టీపై కానీ సదరు అభ్యర్థిపై కానీ విశ్వాసంతో ఓటేస్తారని, అలాంటపుడు ప్రజాభిప్రాయంతో పని లేకుండా తమ అనుచరుల అభిప్రాయం, అభివృద్ధి పేరుతో పార్టీ మారడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటున్నారు. తాము ఎంతో నమ్మకంతో ఓటేస్తే తమ మాటకు విలువ లేకుండా స్వీయ నిర్ణయంతో పార్టీలు మారుతున్న నాయకుల తీరు చూసి ఎన్నికల్లో ఓటేయడానికి కూడా ప్రజలు ఆసక్తిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని విశే్లషకులు పేర్కొంటున్నారు. ఒక వైపు ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతం పెంచడానికి తీసుకుంటున్న చర్యలతో క్రమేణా ప్రజల్లో అవగాహన పెరిగి ఓటేసేందుకు మెజారిటీ ప్రజలు ముందుకు వస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్నికల తరువాత అధికారానికి దూరంగా ఉండలేక పార్టీ మారుతుంటే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల వ్యవస్థపై, నాయకులపై విశ్వాసం కోల్పోతున్నారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ప్రజలను మరింత అసహనానికి గురి చేస్తోందంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న లోపాల కారణంగానే ఎలాంటి జంకు లేకుండా పార్టీ మారుతున్న విషయాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించి మరింత కఠినతరం చేయాలని విశే్లషకులు సూచిస్తున్నారు. మరో వైపు ఎన్నికల కమిషన్ కూడా దీనిపై దృష్టి సారించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఓటేయడానికి ప్రజలను ఒప్పించడం కష్టతరంగా మారుతుందని, పోలింగ్‌లో పాల్గొనే వారి శాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.