ఆంధ్రప్రదేశ్‌

నాలుగేళ్ల బాలుడు... 5 ఆధార్ కార్డులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, మే 19: ఆధార్ కార్డు కోసం దరఖాస్తుచేసుకుని, జారీకాక నెలల తరబడి ఎదురుచూసేవారిని చూశాం... తప్పులు తడకగా వచ్చిన ఆధార్ కార్డుదారులనూ చూశాము. అయితే నిండా నాలుగేళ్లు కూడా లేని ఒక బాలుని పేరిట వివిధ నెంబర్లతో ఐదు ఆధార్ కార్డులు జారీచేసిన ఘనత భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐఎఐ)కి చెల్లింది. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణం ఒకటో వార్డులో 2-2-16 గృహంలో నివసించే మడికి లక్ష్మీ సుజాత తన కుమారుడు మడికి ధర్మ పేరిట ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసింది. 2013 సెప్టెంబర్ 21న జన్మించిన తన కుమారుడికి ఆధార్ కార్డు అవసరమని దరఖాస్తు చేసుకుంది. ఎన్‌రోల్‌మెంట్ నెంబరు 1427/99014/00060తో చేసిన ఈ దరఖాస్తుకు స్పందించిన యుఐఎఐ బాలుడికి ఆధార్‌కార్డును జారీచేసింది.
ఇంతవరకు బాగానేవుంది. అయితే బాలుడి పేరిట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. కార్డులోని బాలుడి పేరు, తల్లిపేరు, చిరునామా ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఆధార్ కార్డుల నెంబర్లు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. 3249 0489 7686, 6087 4774 5351, 3782 0568 0525, 5955 9143 4269, 5186 0155 9591 నంబర్లతో ఈ ఐదు ఆధార్‌కార్డులు జారీఅయ్యాయి. ఒకే పేరు, చిరునామాతో ఐదు నెంబర్లతో విడివిడిగా కార్డులు జారీకావడం అసాధారణమైన విషయంగా రెవిన్యూ అధికారులు పేర్కొంటున్నారు. నమోదు సంఖ్య, దరఖాస్తుదారుని పేరు, చిరునామా ఒకసారి రిజిస్టర్ అయితే సర్వర్ మరో ఆధార్‌కార్డు జనరేషన్‌కు అవకాశమీయదని వారు స్పష్టంచేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ముంబై నుండి జరుగుతోందని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ప్రధానపాత్ర వహించి ఉంటుందని రెవిన్యూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా జారీఅయిన ఐదు ఆధార్ కార్డులలో న్యాయబద్ధమైన పత్రం ఒకటే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన బాలుని తల్లి మడికి లక్ష్మీ సుజాత ఈ కార్డుల్లో ఏది అసలైన కార్డో ఎలా తెలుస్తుందని వాపోతోంది. యుఐఎఐ వర్గాలు స్పందించి, తన కుమారుడిది ఏది అసలైన ఆధార్ కార్డో తెలపాలని ఆమె కోరుతోంది.
chitram...
మడికి ధర్మ పేరిట వేర్వేరు నెంబర్లతో జారీ అయిన అయిదు ఆధార్ కార్డులు