ఆంధ్రప్రదేశ్‌

జగన్ బులెట్ ప్రూఫ్ కారు లాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 19: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు.. ఉదయం ఎనిమిది గంటల సమయం.. బులెట్‌ప్రూఫ్ వాహనం చుట్టూ మఫ్టీలో ఉన్న పోలీసుల హడావుడి పడుతున్న దృశ్యం. మరో 45 నిముషాల్లో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు విమానాశ్రయానికి రాబోతున్నారు. ఆయన కోసం సిద్ధం చేసిన బులెట్‌ప్రూఫ్ వాహనం డోర్లు లాక్ అయిపోయాయి. ఆయన వచ్చేప్పటికి వాహనం సిద్ధంగా లేకపోతే, ఏంముచ్చుకొస్తుందోనని పోలీసు సిబ్బంది, ప్రొటోకాల్ అధికారులకు ముచ్చెమటలు పట్టేశాయి. జగన్ విమానం దిగే చివరి నిముషంలో సమస్య పరిష్కారమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పర్యటన కోసం ప్రతిపక్ష నాయకుడు జగన్ శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఆయనకోసం ఓ బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని సిద్ధం చేశారు. జగన్ మరో 45 నిలుషాల్లో విమానాశ్రయానికి వస్తారనగా, ఆ బులెట్‌ప్రూఫ్ వాహనం డోర్లు లాక్ అయిపోయాయి. వీటి తాళం చెవులను భద్రతా అధికారులు మరిచిపోయారు. డోర్లు తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో శ్రీకాకుళం జిల్లా నుంచి మరో బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని రప్పించేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఆ వాహనం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరడానికి గంటన్నర సమయం పడుతుందని చెప్పారు. ఈ సమయంలో ప్రొటోకాల్ అధికారులు, భద్రతా సిబ్బంది హడావుడి అంతా ఇంతా కాదు. వెంటనే నగర పోలీసు కమిషనర్‌కు ఈ సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడి నుంచి మరో బులెట్‌ప్రూఫ్ వాహనం వచ్చింది. ఆ వాహనం ఎక్కి జగన్ శ్రీకాకుళం వెళ్లారు. దీంతో ఇక్కడి ప్రొటోకాల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

లాక్ అయిన బులెట్‌ప్రూఫ్ వాహనం డోర్లు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా సిబ్బంది