కృష్ణ

ప్రచార లోపాన్ని అధిగమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 21: ప్రచార లోపాన్ని అధిగమిద్దాం.. ప్రజలకు అన్నీ చేస్తున్నా చెప్పుకోలేకపోతున్నాం.. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నాం.. మన నాయకుడు పడుతున్న కష్టాన్ని ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నాం.. ప్రతి ఒక్కరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి.. జనంలోకి వెళ్లండి.. వాళ్లతోనే కూర్చోండి.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కూలంకషంగా వివరించండి.. అభివృద్ధి అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుయుక్తులను అర్ధమయ్యేలా చెప్పండి.. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయండి.. అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం సమీపంలోని సుల్తానగరం వద్ద శ్రీరామరాజు కనె్వన్షన్ సెంటరులో ఆదివారం తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి దేవినేని ఉమా పార్టీ శ్రేణులకు దిశా, నిర్దేశం చేశారు. మరో రెండేళ్లల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయటంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త రథసారథులుగా వ్యవహరించి పార్టీకి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలను దమ్ముగా, ధైర్యంగా తిప్పి కొట్టాలన్నారు. అప్పుడే నాయకత్వ లక్షణాలు పెరిగి పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. నియోజకవర్గాల వారీగా నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ పార్టీ శ్రేణులకు క్లాస్ తీసుకున్నారు. బందరు పోర్టు మన గుండె చప్పుడు అన్నారు. బందరుకు ఓడను తీసుకు వచ్చిన తర్వాతే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వస్తామన్నారు. 2018 నాటికి పోలవరంలో కాంక్రీట్ పని పూర్తి చేస్తామన్నారు. పరిశీలకునిగా వచ్చిన మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పనితీరును వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల దిశగా పార్టీని తీసుకువెళ్లాలన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాసటగా నిలవాలన్నారు. రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ భారతదేశంలో సంక్షేమానికి శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చటంతో పాటు ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్నట్లు చెప్పారు. కార్పొరేషన్‌ల ద్వారా బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడిన వారికి ఆర్థిక తోడ్పాటు ఇస్తున్నామన్నారు. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బలమైన శక్తి కార్యకర్తలేనన్నారు. రానున్న ఎన్నికల నాటికి ప్రతి గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట కావాలన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టాను గట్టెక్కించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాలకే దక్కుతుందన్నారు. బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల కోల్పోయిన ఉద్యోగావకాశాలను తిరిగి తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తున్నారన్నారు. ఐటి కంపెనీల ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం కానున్నాయన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి, పార్టీకి కీలకం కానున్నాయన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కష్టపడి రానున్న ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని అందించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి రాజా మాష్టారుతో పాటు ఎమ్మెల్యేలు జయమంగళ వెంకట రమణ, వల్లభనేని వంశీ మోహన్, ఉప్పులేటి కల్పన, ఎమ్మెల్సీలు వైవిబి రాజేంద్ర ప్రసాద్, ఎస్ రామకృష్ణ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఉత్సాహంగా టిటి రెసిడెన్షియల్ క్యాంప్
విజయవాడ (స్పోర్ట్స్), మే 21: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నగరంలోని శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఇండోర్ స్టేడియంలో టేబుల్ టెన్నిస్ రెసిడెన్షియల్ శిక్షణా శిబరం జరుగుతుంది. ఈశిక్షణా శిబిరంలో రాష్ట్రంలోని జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులతో పాటు అండర్-18 బాలుర, బాలికల విభాగంలో ప్రతిరోజు ఉదయం, సాయం త్రం సుమారు 6గంటల పాటు ప్రత్యేక శిక్షణానిస్తున్నారు. బాలుర విభాగంలో 20మంది, బాలికల విభాగంలో 20మంది క్రీడాకారులు శిక్షణకు హజరవుతున్నారు. శిక్షణా శిబిరంలో ఎక్కువ శాతం మంది చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలలోపు బాలబాలికలు ఎక్కువ మంది పాల్గొంటున్నారు. వీరికి శాప్ కోచ్ అచ్యుత్‌తో పాటు రాష్ట్ర సంఘం నియమించిన మరో ఇద్దరు కోచ్‌లు వై దామోదరరెడ్డి, పాండురంగారావుల పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. కళాశాల యాజమాన్యంతో పాటు వ్యాయామ విద్యా విభాగం పూర్తి సహకారాన్ని అందిస్తూ శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ చిన్నారులు ఎండను సైతం లెక్కచేయకుండా శిక్షణకు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఈనెల 8వతేదీన ప్రారంనమైన శిక్షణా శిబిరం 28వతేదీ వరకు జరుగనుంది. శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులు ఉదయం టిఫిన్‌తో పాటు భోజనం, వసతి సౌకర్యం శాప్ కల్పిస్తుంది. శాప్ అధికారులు ప్రత్యేకంగా శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షిస్తూ ఏప్పటికప్పుడు కోచ్‌లను అడిగి తెలుసుకుంటున్నారు. కోచ్‌లు క్రీడాకారుల యొక్క క్రమశిక్షణతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా శ్రద్ద తీసుకున్నారు. ఈశిబిరంలో అంతర్జాతీయ క్రీడాకారిణి శైలూనూర్ భాషాతో పాటు జాతీయస్థాయి క్రీడాకారులు కాజోల్, అనూష, మహిత, నాజీరాబి, హిమప్రియ, హసిని, దీప్తి, ఆదిలక్ష్మీ, అక్షిత్, దీపక్, కార్తికేయ, కుష్ వంటి వారు ఉండటంతో చిన్నారులకు మెళకువలు నేర్చుకోవడానికి మరింత అవకాశం దొరికింది. ఇలాంటి శిక్షణా శిబిరాలను ఎర్పాటు చేసిన శాప్ అకాడమిలను సైతం యుద్ధ ప్రతిపాదికాన ఎర్పాటు చేయాలని క్రీడాకారులు కోరుచున్నారు. రాష్ట్ర టిటి సంఘ కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్ ప్రత్యేక శ్రద్దతో నగరంలో టిటి అకాడమిని నెల్లకోల్పే అవకాశం ఉందని పలువురు టిటి క్రీడాకారులు తెలిపారు.
రోబో ట్రైనింగ్...
టిటి రెసిడెన్షియల్ శిక్షణా శిబిరంలో రోబోతో శిక్షణా నిస్తున్నారు. సుమారు లక్షన్నర విలువ గల రోబోను ఈ శిబిరంలో శిక్షణా నిచ్చేందుకు వాడుతున్నారు. దీంతో చిన్నారులు మరింతగా ఆసక్తి చూపుతున్నారు. రోబోతో వివిధ రకాలుగా శిక్షణానిస్తూ ప్రత్యేకమైన మెళకువలు నేర్పుతున్నారు.