కృష్ణ

బచ్చులకే పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 21: తెలుగుదేశం పార్టీకి అవిర్భావం నుండి పార్టీకి విధేయుడిగా ఉంటూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన బచ్చుల అర్జునుడుకే మళ్లీ జిల్లా పార్టీ పగ్గాలు లభించాయి. ఆదివారం స్థానిక శ్రీరామరాజు కనె్వన్షన్ సెంటరులో నిర్వహించిన టిడిపి జిల్లా కమిటీ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా అర్జునుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు పరిశీలకునిగా వచ్చిన మంత్రి నక్కా ఆనందబాబు పార్టీ ముఖ్యుల నుండి అభిప్రాయ సేకరణ అనంతరం అర్జునుడుని పేరును ప్రకటించారు. అర్జునుడితో పాటు ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్న తోట వీరబాబును ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్ష పదవి అర్జునుడుతో పాటు పెనమలూరు నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు గొట్టిపాటి రామకృష్ణ పోటీ పడ్డారు. అత్యంత ఉత్కంఠత మధ్య అర్జునుడు పేరును పరిశీలకుడు ఆనందబాబు ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియ ముందు జరిగిన సమావేశంలో అర్జునుడు ఏకగ్రీవ ఎన్నికకు తాను సహకరిస్తున్నానని గొట్టిపాటి రామకృష్ణ చెప్పారు. దీంతో ఎటువంటి అభ్యంతరాల సేకరణ లేకుండా అర్జునుడు పేరును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ తర్వాత వచ్చిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ ముఖ్యుల అభిప్రాయాల సేకరణ అనంతరం అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను అధిష్ఠానానికి పంపి అక్కడి నుండి ప్రకటన వస్తుందని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. దాదాపు ఏకగ్రీవమైన ఎన్నికలో దేవినేని ఉమా మెలికి పెట్టడంతో అంతా నిచ్చేష్టులయ్యారు. సమావేశానంతరం పరిశీలకుడు ఆనందబాబు నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడిన రామకృష్ణ ప్రసాద్‌ను ఎంపి కొనకళ్లతో పాటు మరికొంత మంది నచ్చ చెప్పి పోటీ నుండి విరమింప చేశారు. రహస్య చర్చల అనంతరం నక్కా ఆనందబాబు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అర్జునుడు, ప్రధాన కార్యదర్శిగా తోట వీరబాబుల పేర్లను ప్రకటించారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని, అనుబంధ కమిటీల ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అర్జునుడు, వీరబాబులను కార్యకర్తలు, అభిమానులు గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకునిగా ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, టిడిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి రాజా మాష్టారుతో పాటు జిల్లాకు చెందిన మరో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, కేశినేని నాని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్సీలు వైవిబి రాజేంద్ర ప్రసాద్, ఎస్ రామకృష్ణ, ఎన్టీఆర్ వైద్య సేవ కన్వీనర్ డా. సిఎల్ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు జయమంగళ వెంకట రమణ, వల్లభనేని వంశీ మోహన్, ఉప్పులేటి కల్పన తదితరులు పాల్గొన్నారు.

హనుమత్ పీఠంలో శ్రీ వీరాంజనేయస్వామికి
వైభవంగా లక్ష బిళ్వార్చన
* ముగిసిన హనుమద్దీక్షలు
* వేలాది మంది భక్తులకు అన్నదానం
పాతబస్తీ, మే 21: హనుమాన్ నామజపం ఎంతో శక్తివంతమైనది, హనుమత్ దీక్షలను స్వీకరించడం వలన శ్రీ వీరాంజనేయస్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారని శ్రీ హనుమత్ దీక్షా పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ అన్నారు. శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఆదివారం పాల ఫ్యాక్టరీ వద్దగల హనుమత్ పీఠంలో శ్రీ వీరాంజనేయస్వామివారికి విశేష పూజలు చేసి లక్ష బిళ్వార్చనతో స్వామివారిని అర్చించారు. తెల్లవారుఝాము నుంచే విచ్చేసిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఈ సందర్భంగా శ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ మాట్లాడుతూ శ్రీ హనుమంతులవారిని ఆరాధించిన వారిని ఆయన ఎల్లవేళలా కాపాడుతారని వివరించారు. సర్వశక్తివంతుడైన శ్రీ వీరాంజనేయస్వామివారిని ఆరాధిస్తే సర్వం శుభప్రదమని ఆయన చెప్పారు. భక్తులకు హనుమజ్జయంతి విశేషాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన హనుమత్ దీక్షాధారణ చేత స్వామీజీ తన స్వహస్తాలతో దీక్షలను విరమింప చేసారు. శ్రీ హనుమత్ దీక్షాపీఠం కన్వీనర్ రాంపిళ్ల జయప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒరిస్సా, చత్తీస్‌గఢ్, తమిళనాడుల నుంచి కూడా హనుమత్‌దీక్షలు తీసుకున్న భక్తులు ఇక్కడికి తరలివచ్చి స్వామివారికి ఇరుముడులను సమర్పించారని అన్నారు. వేలాదిగా వచ్చిన భక్తులకు వసతి, భోజన సదుపాయాన్ని తాము హనుమత్ పీఠంతో పాటుగా సమీపంలోని ఎస్‌ఎఎస్ కాలేజీలో కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ పవన్ స్వామీజీ, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి దేవస్థానం అధ్యక్షులు రాంపిళ్ల గౌరీశంకర్, పీఠం సభ్యులు తమ్మిన యజ్ఞేశ్వరరావు (మారుతీ), ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల కోసం డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో యజ్ఞ మహాపూర్ణాహుతిని శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ నిర్వహించారు. జై శ్రీరామ్, జై వీర హనుమాన్ అంటూ భక్తుల జయజయ ధ్వానాలతో పీఠం పరిసరాల్లో భక్త్భివం వెల్లివిరిసింది. కాగా హనుమత్ దీక్షలకు తరలివచ్చిన భక్తులకు శ్రీ హనుమత్ పీఠంలో శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ జరిగింది.
ఘనంగా హనుమద్దీక్షల విరమణ
వేలాదిగా తరలివచ్చిన హనుమత్ భక్తులతో శ్రీ హనుమత్‌పీఠం కళకళలాడింది. హనుమజ్జయంతి సందర్భంగా అర్ధరాత్రి నుంచే హనుమత్ దీక్షాధారులు తరలివచ్చి శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీచే తమ దీక్షలను విరమింప చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో దీక్షాధారులు కార్లు, జీపులు, మినీ వ్యాన్లలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. భక్తుల సౌకర్యం కోసం బారికేడ్లను ఏర్పాటు చేయడంతో వారు వరుస క్రమంలో శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు శ్రీ వీరాంజనేయస్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.