హైదరాబాద్

నగరం.. నిప్పుల కొలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 21: భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం నుంచే సూర్యకిరణాలు వెదజల్లుతున్న వేడితో నగరం నిప్పుల కొలిమిగా మారిపోతుంది. ఉదయం ఏడు గంటలకు మందే ఆకాశాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తున్న సూర్యుడు సాయంత్రం ఆరు దాటినా శాంతించడం లేదు.
భానుడు విశ్వరూపాన్ని చూపిస్తుంటంతో ఇల్లు వదిలి బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. గతంలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ శరీరంపై చెమట జాడ కనిపించేది కాదు. పట్టణీకరణ, నగరంలో పెరుగుతున్న కాలుష్యం, వృక్ష సంపద తగ్గిపోవడం వంటి కారణాలతో మునుపెన్నడూ లేని విధంగా ఉక్కపోతతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొంది. వేడి నుంచి తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంట్లోనే ఉండి సేద తీరుదామన్నా.. ఆ అవకాశం లేకుండా పోతోంది. కూలర్స్, ఫ్యాన్ల నుంచి సైతం వేడి గాలులు వస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా పోతుంది. సుమారు 44 డిగ్రీలకు పైగా నమోదౌతున్న ఉష్ణోగ్రతలకు వాడగాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతులకుపై ఎండ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. భవన నిర్మాణ కార్మికులు, దినసరి కూలీలు, ఆటోవాలాలు జీవన పోరాటంలో ఒక్కరోజు విధులు నిర్వహిస్తే రెండు రోజులు ఇంటికే పరిమితం కావాల్సి వస్తుంది. భానుడి భగభగలతో నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రోజు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడే పంజాగుట్ట, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ తదితర ప్రాంతాల్లోని రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయా రోడ్లపై ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోతుందని వాహనదారులు పేర్కొంటున్నారు.
మెట్రో పిల్లర్ల నీడలో ప్రయాణం
అత్యవసర పరిస్థితిలో ఇంటి వదిలి బయటకు వస్తున్న వారు ప్రదాన రహదారిపైకి రాగానే మెట్రోపిల్లర్లు, వయాడక్ట్‌ల నీడలో తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కొంత ఆలస్యం అయినా ఎండ నుంచి తప్పించుకునేందుకు అలా ముందుకు సాగిపోతున్నారు.
పర్యాటక ప్రాంతాలు వెలవెల
సాధారణ రోజుల్లోనే కిటకిటలాడే నగరంలోని పర్యాటక ప్రాంతాలు సెలవల్లోనూ వెలవెలబోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలతో నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి.
ఎండ వేడికి నగరంలో నివసిస్తున్న వారే బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల గురించి చెప్పనక్కర్లేదు. దీంతో పర్యాటక ప్రాంతాలైన జూపార్క్, చార్మినార్, గోల్కొండ కోట, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.