ఆంధ్రప్రదేశ్‌

మంచినీటికి కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్లు కూల్చవద్దన్నా లెక్క లేదా? ఉపాధి కార్మికులతో పారిశుద్ధ్యం అభివృద్ధి గ్రామాలకు స్టార్ రేటింగ్‌లు
త్వరలో గ్రూప్-1, 2 నియామకాలు గ్రామీణాభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష

అమరావతి, మే 23: రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించడం కోసం ప్రత్యేకంగా తాగునీటి సరఫరా సంస్థ (డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సిఎం చంద్రబాబు వెల్లడించారు. మారుమూల గ్రామాలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ రక్షిత మంచినీరు అందించడం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ తరహా వ్యవస్థ అవసరముందని, దీనిపై రెండు మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. దీన్ని గ్రామీణ వౌలిక సదుపాయాల కల్పన సంస్థగా తీసుకురావాలా? లేక ప్రత్యేకంగా నీటి సరఫరా కోసమే ఏర్పాటు చేయాలా? అన్నది త్వరలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో చేపట్టిన పనుల పురోగతిని మంగళవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. వచ్చే ఆరు మాసాల్లోగా రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి కాలుష్య సమస్య తలెత్తకుండా పరిశుద్ధ జలాలు అందించగలిగేలా ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఏ గ్రామంలోనూ మంచినీరు కలుషితం కాకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో వ్యాధులు ప్రభలకుండా ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామా ల్లో పారిశుద్ధ్య నిర్వహణ అత్యుత్తమ స్థాయిలో ఉండాలన్నారు. అవసరమైతే వారానికి రెండు మూడుసార్లు జాతీయ ఉపాధి హామీ కార్మికులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు వైద్య ఆరోగ్య శాఖను సమన్వయం చేసుకుని వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందునుంచే ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
అన్ని ముఖ్యమైన శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలోనే రెండువేల గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలు జరుపుతామని బాబు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కీలక భూమిక పోషించే అధికారుల అవసరాన్ని గుర్తించామని, సాధ్యమైనంత త్వరలో నియామకాలు జరుపుతామన్నారు. గ్రామీణ వౌలిక సదుపాయాలన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. గ్రామాల్లో రహదారి అనుసంధానానికి ఖచ్చితమైన వ్యూహ ప్రణాళిక ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రహదారులు, తాగునీటి సరఫరా, ఇంటింటికీ మరుగుదొడ్డి, వర్మీ కంపోస్టు తదితర ఏడు అంశాల నిర్వహణ తీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ఏడు నక్షత్రాల రేటింగ్ పద్ధతి అమలు చేస్తున్నామన్నారు. ఏడు నక్షత్రాలు పొందిన గ్రామానే్న అభివృద్ధి చెందిన గ్రామంగా గుర్తిస్తామన్నారు.
మేజర్ గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలన్నారు. వన సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, కేవలం విత్తనాలు జల్లే సంప్రదాయ పద్ధతులతో సరిపుచ్చుకోకుండా హైడ్రాలిక్ మిషన్ సాయంతో మొక్కలు నాటాలన్నారు. అభివృద్ధి పేరిట ఇష్టానుసారం చెట్లు నరకొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కొన్నిచోట్ల విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారని, రహదారి విస్తరణకు అడ్డొచ్చిన చెట్లను వేళ్లతో సహా పెకిలించి వేరే ప్రాంతాలకు తరలించి నాటే సాంకేతికత అనుసరించాలని సూచించారు. వర్మీ కంపోస్టు నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా సిఎంకు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,393 వర్మీ కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, 7,847 యూనిట్లను సిద్ధం చేసిటన్టు వివరించారు. డిసెంబరులో రాష్ట్రం మొత్తం ఓడిఎఫ్‌గా రూపొందాలని, డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించి ఇంటింటి సర్వే జరిపించాలని చెప్పారు. కలెక్టర్ల సదస్సు నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ సేనాని పేరుతో విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేసినట్టే ఉపాధ్యాయులనూ భాగస్వాములను చేసి తగిన హోదా ఇవ్వాలని ఆదేశించారు.
chitram...
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పురోగతిని సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు