ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తే ఈర్ష్యగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 28: కోట్లాది రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని, లోటు బడ్జెట్ ఉన్నా, ఏపిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయని, మీ రాష్ట్రాన్ని చూస్తే, మాకు ఈర్ష్య కలుగుతోందని తెలంగాణ టిడిపి అధికార ప్రతినిధి అరవిందకుమార్ గౌడ్ అన్నారు. విశాఖ మహానాడులో ప్రవేశపెట్టిన తెలంగాణలో సంక్షోభంలో సంక్షేమ రంగం, కొరవడిన సామాజిక న్యాయం, ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ వికలాంగుల రిజర్వేషన్ వైఫల్యాపై జరిగిన చర్చపై అరవిందగౌడ్ మాట్లాడుతూ బంగారు తెలంగాణను తీసుకువస్తానని కెసిఆర్ చెపితే అది నిజమనుకున్నామని, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయినా, ఇప్పటికీ ఆ బంగారు తెలంగాణ రాలేదని ఆయన అన్నారు. ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని, కానీ ఆ ఫలాలను కేసిఆర్ కుటుంబంలోని నలుగురు మాత్రమే అనుభవిస్తున్నారని అరవిందగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే, షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని సిఎం చేస్తానని కెసిఆర్ ప్రకటించి, మాట తప్పారని ఆయన అన్నారు. తెలంగాణలో రెండు లక్షల డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇస్తానని కెసిఆర్ చెప్పారని, ఇప్పటికి ఎన్ని ఇళ్ళు నిర్మించారో, కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీలకు మూడు ఎకరాల చొప్పున భూమి ఇస్తానన్న ప్రాజెక్ట్‌ల పేరుతో కెసిఆర్ ఎస్సీలకు చెందిన 7000 ఎకరాలను అన్యాయంగా తీసుకున్నారని అరవింద్ గౌడ్ చెప్పారు. సామాజిక న్యాయాన్ని టిడిపి ఏనాడూ విస్మరించలేదని, అయితే కేసిఆర్ బడుగు, బలహీన వర్గాల వారిని దగా చేసిందని ఆయన చెప్పారు. తెలంగాణలో టిడిపి అధికారం కోల్పోయిన తరువాత తామంతా అనాధలుగా మిగిలిపోయామని అన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి టిఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.ఈ తీర్మానాన్ని బలపరిచిన తెలంగాణ నేత బోడ జనార్థన్ మాట్లాడుతూ కెసిఆర్ మాటలు వింటే కడుపు నిండిపోతుందని, పనితనం చూస్తే, కడుపు మండుతుందని అన్నారు. విద్యార్థులు, ఉద్యమ నాయకులపై కెసిఆర్ ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. కెసిఆర్ స్వేచ్ఛగా బయటకు వచ్చే పరిస్థితి లేదని, భద్రతతో బయట తిరుగుతున్నారన్నారు. సీతక్క మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు మధ్యయుగంలో నాటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు.