కృష్ణ

మ్యాంగో మార్కెట్ ఆఫీసులో చోరీ సొమ్ము స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, మే 29: మండలంలోని అడ్డరోడ్డు సమీపంలో ఉన్న కృష్ణా ఆగ్రోమ్యాంగ్ మార్కెట్ ఆఫీస్ రూమ్‌లో ఈనెల 18న చోరికి గురైన రూ. 28,88,500 నగదును సోమవారం స్వాధీనపర్చుకుని దొంగను రెడ్డిగూడెం మండలం కుదప అడ్డరోడ్డు వద్ద అతి చాకచక్యంగా పట్టుకున్నట్లు నూజివీడు డిఎస్‌పి వి శ్రీనివాసరావు తెలిపారు. ఎకొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలం కుదప గ్రామానికి బేసి చిరంజీవి ఈనెల 18న మ్యాంగ్ మార్కెట్‌లో ప్రవేశించి రెండు గంటల సమయంలో ఆఫీస్‌రూమ్‌లో గుమస్తాలు భోజనానికి వెళ్ళిన సమయంలో బీరువాను స్క్రూడ్రైవర్‌తో తెరిచి అందులో ఉన్న నగదును అపహరించారని తెలిపారు. ఈ విషయమై యజమాని పాలేటి నాగేశ్వరరావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా తన పర్యవేక్షణలో మైలవరం సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో, మైలవరం, రెడ్డిగూడెం, వీరవల్లి, ముసునూరు, విస్సన్నపేట ఎస్‌ఐలు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్లూస్ టీమ్ ఆధారాల మేరకు నేరస్థుడిని పట్టుకున్నట్లు తెలిపారు. చోరి సొమ్ములో రెండు లక్షలు తన జల్సాల నిమిత్తం ఖర్చుచేయగా మిగిలిన నగదును స్వాధీనపర్చుకున్నట్లు చెప్పారు. నేరస్థుడిపై ఖమ్మం, సత్తుపల్లి, గన్నవరం,ఊయ్యూరు, నూజివీడు, ఎ కొండూ రు, ఏలూరు, మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లలో 29 కేసులు నమోదై ఉండగా రెడ్డిగూడెం మండలంలో అనుమానిత రౌడిషీటర్‌గా నమోదై ఉందన్నారు. ఈకేసును త్వరితగతిన ఛేదించిన ఎఎస్‌ఐ శంకర్, ఎస్‌సి బేగ్, కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సర్దార్, పులి రాజేష్, బాలరమేష్, క్రైమ్ సిబ్బందికి రివార్డు ప్రకటించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ విషయమై జిల్లా ఎస్‌పి విజయకుమార్ ఏలూరురేంజి డిఐజి టివిఎస్ రామకృష్ణ అభినందినట్లు డిఎస్‌పి శ్రీనివాసరావు పేర్కొన్నారు.