కృష్ణ

రైతుల ఆదాయం రెండింతలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 29: పంటలను కాపాడటమే కాదు ఆ పంటల ద్వారా వచ్చే దిగుబడిని కాపాడి రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐటి, సేవా రంగాల్లో గ్రోత్ రేట్‌లో జిల్లా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ వ్యవసాయం, పరిశ్రమ రంగాల్లో కూడా గ్రోత్ రేట్ సాధనకు కృషి చేయాలన్నారు. వ్యక్తిగత తలసరి ఆదాయం పెంచాలన్నారు. జూన్ 2వతేదీన విజయవాడ బెంజ్ సర్కిల్‌లో నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఈ మూడేళ్లలో సాధించిన ప్రగతిని శాఖల వారీగా సిద్ధం చేసి తనకు నివేదించాలన్నారు. నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2వతేదీ నుండి 8వ తేదీ వరకు వివిధ అంశాలపై ప్రతి రోజూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. 2వతేదీన రాజధాని నీలి రహిత నగరం నమూనాను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం కాబోతున్న దృష్ట్యా ఖరీఫ్‌కు సరికొత్త ప్రణాళికలు తయారుచేయాలన్నారు. సాగు విస్తీర్ణం పెంపుతో పాటు దిగుబడులు కూడా భారీగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయం అంతంత మాత్రం ఉండే ప్రాంతాల్లో ఆ ప్రాంత రైతుల్ని ఉద్యానవన పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండింతలు ఆదాయం వచ్చే విధంగా వ్యవసాయ శాఖాధికారులు కృషి చేయాలన్నారు. చేలగట్లపై కందులు సాగు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఈ-సీడ్స్ పథకం కింద 10వేల 900 మెట్రిక్ టన్నులకు గాను 8వేల 100 మెట్రిక్ టన్నుల విత్తనాలు పంపిణీ చేసి రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ప్లాటిక్స్ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ ద్వారా ఫొటో తీస్తే మొక్కల వ్యాధి, లోపాన్ని తెలియజేస్తుందన్నారు. ఉపాధి హామీ పనులు 25వేలకు పెంపు చేయాలన్నారు. కూలీల సంఖ్య పెరగాలే గానీ తగ్గకూడదన్నారు. చెల్లింపులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి నెలా మొదటి వారం అన్ని గ్రామ పంచాయతీల్లో హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తొలి విడతగా జిల్లాలోని 672 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మొదలు పెట్టాలని, ఇందుకు గాను 10 సెంట్ల స్థలాన్ని గుర్తించాలన్నారు. జిల్లాలో యువ భవన్, బిసి భవన్, కాపు భవన్‌లు నిర్మించేందుకు స్థలాలను గుర్తించాలన్నారు. ఆహార భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. చిన్న చిన్న హోటల్స్ నుండి పెద్ద పెద్ద మాల్స్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపామన్నారు. ఒకటికి రెండుసార్లు కల్తీ ఆహారంలో పట్టుబడ్డ వారిని జిల్లా నుండి బహిష్కరిస్తామని, పిడి యాక్ట్ కింద క్రిమినల్ కేసులతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ వసతి గృహాలకు పరిమితమైన స్వీకారం కార్యక్రమాన్ని అంగన్‌వాడీ, పిహెచ్‌సిలు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 150 హాస్టల్స్‌ను, 42 అంగన్‌వాడీ కేంద్రాలను స్వీకారం కింద స్వచ్చంద సంస్థల సహకారంతో అభివృద్ధిపర్చామన్నారు. అలాగే హాస్టల్స్‌లో చదువుకునే విద్యార్థుల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, డిఆర్‌డిఎ పిడి చంద్రశేఖరరాజు, డియస్‌ఓ నాగేశ్వరరావు, జెడ్పీ ఇన్‌ఛార్జ్ సిఇఓ ఎన్‌వివి సత్యనారాయణ, డియంఅండ్‌హెచ్‌ఓ డా. కామేశ్వర ప్రసాద్, సిపిఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.