ఆంధ్రప్రదేశ్‌

గ్రేహౌండ్స్‌కు రూ.400 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.400 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్వి నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు, నిఘా సంస్థలు, సీఆర్‌పీఎఫ్ అధికారులతో సమన్వయం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ నుంచి డీజీపీ ఎన్.సాంబశివరావు హాజరయ్యారు. అనంతరం డీజీపీ విలేఖరులతో మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల మధ్య సహకారం, సమాచారాన్ని రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకోవడంపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. వామపక్ష తీవ్రవాదం ప్రభావ రాష్ట్రాలలో చర్యలు ముమ్మరంగా పటిష్టంగా చేపట్టాలని, మావోయిస్టుల ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తెలంగాణ తరహాలో గ్రేహౌండ్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికపై కేంద్ర అధికారులు పరిశీలించినట్టు తెలిపారు. ఏపీకి గ్రేహౌండ్స్ ఏర్పాటుకు రూ.400 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించినట్టు తెలిపారు. విశాఖలో గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు నిధులు మంజూరుకానున్నట్టు పేర్కొన్కారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజల వద్దకు వౌలిక సౌకర్యాలు అందించగలిగితే ప్రభావం తగ్గడానికి అవకాశం ఉందని చెప్పారు. అలాగే గతంతో మాదిరి కాకుండా కేంద్రం రాష్ట్రాలకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు.