ఆంధ్రప్రదేశ్‌

1 నుంచి బాలామృతం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో బాలామృతం పంపిణీతో పాటు అన్ని ప్రాజెక్టుల్లోనూ అన్న అమృతహస్తం పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. అలాగే, అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను ఒకటో తేదీ నుంచి నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నామని ఆమె వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలోని మూడో బ్లాక్‌లో 13 జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖర్ల సమావేశంలో మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు బాలామృతం పథకాన్ని అమలు చేశారన్నారు. బాలామృతం తయారీ యూనిట్ తెలంగాణలో ఉండడంతో రాష్ట్ర విభజన తరువాత ఎపిలో పంపిణీ నిలిచిపోయిందన్నారు. కొద్ది నెలలుగా తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో, మరోసారి ఎపిలో బాలామృతం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బాలామృతం ప్యాకెట్లను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టుల్లోనే అన్న అమృతహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. జూలై ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లోనూ ఈ పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద గర్భిణులకు, బాలింతలకు అన్న అమృతహస్తం పథకం కింద ఆహారం అందిస్తామన్నారు. మహిళల్లో రక్తహీనత నివారణతో పాటు పౌష్టికాహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
జూలై ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కార్యకర్తల బ్యాంకు ఖాతాల్లో వారి వేతనాలు జమ చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఇకపై జీతాల కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవస్థలు తప్పుతాయన్నారు. మున్సిపాల్టీలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మార్చి ఇంగ్లీష్ మీడియంలో బోధన సాగిస్తామన్నారు.
రాష్ట్రంలో 7 వేల అంగన్వాడీ భవనాల నిర్మాణాలు చేపట్టామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ భవనాలన్నింటినీ వచ్చే ఆగస్టులోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 1,422 భవనాల నిర్మాణం పూర్తయ్యాయన్నారు. మిగిలిన భవనాలు ఆగస్టులోగా పూర్తవుతాయన్నారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా జరుగుతున్న కోడిగుడ్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని అంతకుముందు 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు.

చిత్రం.. మార్కెటింగ్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి పరిటాల సునీత