ఆంధ్రప్రదేశ్‌

పప్పుల మిల్లుల్లో తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 2: గుంటూరు జిల్లా తెనాలిలోని పప్పుల మిల్లుల్లో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సోమవారం తనిఖీలు నిర్వహించి 220 బస్తాల నిషిద్ధ కెమికల్స్ పౌడర్‌ను సీజ్ చేశారు. జిఎఫ్‌ఓ పూర్ణచంద్రరావు కథనం ప్రకారం.. తెనాలి పరిసర ప్రాంతాల్లోని పప్పుల మిల్లుల్లో ప్రభుత్వం నిషేధించిన సిల్కా, గ్లాసి, సోమ్ రకాల పౌడర్లను పప్పుల నిల్వలకు వాడుతున్నట్లు వారికి సమాచారం అందింది. దీంతో బుర్రిపాలెం రోడ్‌లోని విజయలక్ష్మి డాల్ మిల్లులో 20 బస్తాలు, కుచేలా డాల్ మిల్లులో 200 బస్తాలకు పైబడిన పౌడర్‌ను సీజ్ చేశారు. ఈ పౌడర్‌ను వాడి పప్పులను ఎక్కువ కాలం నిల్వ చేయటం వల్ల క్యాన్సర్ సోకటం, లివర్ దెబ్బతినటం, జీర్ణకోశ వ్యాధులు క్రమంగా వ్యాప్తిచెంది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని నిషేధించినా కొందరు వ్యాపారులు తమ అక్రమ వ్యాపారాల కోసం పౌడర్లను వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరైనా నిషిద్ధ కెమికల్స్ పౌడర్‌ను వాడుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తనిఖీలు నిర్వహించిన మిల్లుల్లోని పప్పుల నిల్వలకు ఈ పౌడర్ వాడినట్లు అనుమానిస్తున్నామని, శ్యాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు వివరించారు. కల్తీ అయినట్లు నిర్థారణ జరిగితే సంబంధిత మిల్లుల లైసెన్స్‌లు రద్దు చేయించి, యజమానులపై చట్టపరంగా క్రిమినల్ కేసులు పెడతాయని ఆయన తెలిపారు. తనిఖీల్లో జిఎఫ్‌ఓ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.