ఆంధ్రప్రదేశ్‌

‘పురుషోత్తపట్నం’ పనులకు బ్రేకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 20: అఖండ గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద నిర్మిస్తున్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి సంకల్పం నెరవేరే సూచనలు కనిపించడంలేదు. ప్రధానంగా ఈ పథకం పైపులైన్ పనులకు వర్షాలు ఆటంకంగా నిలుస్తున్నాయి. దీనికి తోడు పంపుహౌస్ నిర్మాణ పనులకు విఘాతం కలిగేలా జూలైలో నదికి వరద పోటు తగిలేలావుంది. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నం పనులకు సీజనల్ బ్రేకు పడే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ స్ఫూర్తితో పురుషోత్తపట్నం పనులను పరుగులు పెట్టించి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతమైతే పనులు జోరుగానే సాగుతున్నాయి. అయితే పరీవాహ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా పురుషోత్తపట్నం, రామచంద్రపురం, కొండేపూడి, నాగంపల్లి ప్రాంతాల్లో పైపులైన్ నిర్మాణ పనులకు అవాంతరం కలుగుతోంది. పైపులు సిద్ధంగానే ఉన్నా, వాటిని అలైన్‌మెంట్‌కు తరలించడానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికే పురుషోత్తపట్నం హెడ్ వర్క్సు ప్రాంతానికి భారీ వాహనాలు తరలించారు. ఒకవైపు పైపులైన్ పనులు, మరోవైపు పంపుహౌస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గోదావరి నది నుండి పోలవరం ఎడమ కాలువ ద్వారా 30 టిఎంసిల నీటిని తరలించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు నుంచి ఈ పథకంలో నీటిని తీసుకెళ్లి తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరులో పోసి, అక్కడి ఆయకట్టును రబీ సమయం నుంచి స్థిరీకరించడం ప్రధాన కర్తవ్యంగా పనులు జరుగుతున్నాయి. విశాఖ పారిశ్రామిక, మంచినీటి అవసరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సమకూర్చుకోవచ్చు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా సాధించే ప్రయోజనాలను ముందస్తుగానే పొందేందుకు ఉద్దేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అంతర్భాగంగా 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు, విశాఖకు పారిశ్రామిక, మంచినీటి అవసరాలకు దీన్ని నిర్మిస్తున్నారు. జూలై 15 నాటికి ఊట నియంత్రణ గోడ (డయాఫ్రం వాల్) పూర్తిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే వర్షాలవల్ల ఈ గోడ, పైపులైన్ పనులకు ఇబ్బంది కలుగుతోంది. ఊట నియంత్రణ గోడకు మొత్తం 82 ప్యానల్స్ వుండగా అందులో ఇప్పటివరకు 44 ప్యానల్స్ వరకు పూర్తిచేశారు. ఇక పంపుహౌస్‌కు సంబంధించి మూడు పంపువాల్స్ నిర్మాణం జరుగుతోంది. పంపుహౌస్ నుంచి నేలకోట వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాల్వ వరకు 50 మీటర్ల మేర ప్రెజర్ మెయిన్‌ను పది వరుసల్లో నిర్మించాల్సివుంది. ముందుగా ఐదు వరుసల్లో ప్రెజర్ మెయిన్ నిర్మిస్తున్నారు. ముందుగా పైపులైన్ నిర్మాణాన్ని అటు ఎండ్ పాయింట్ అంటే నేలకోట వద్ద, ఇటు పంపుహౌస్ సమీపంలోనూ చేపట్టారు. ఎండ్ పాయింట్‌లో చాలావరకు పైప్‌లైను పూర్తయింది. ఇప్పటివరకు సుమారు 13 మీటర్ల పైపులైను నిర్మాణం పూర్తయింది. అయితే ప్రస్తుతం దాదాపు 30 మీటర్లకు సరిపడా పైపులు సిద్ధంగావున్నట్టు తెలుస్తోంది. అయితే పనులు జరిగే చోటకు పైపులను చేర్చడానికి వర్షాల వల్ల రోడ్లు సహకరించని స్థితివుంది. పైపులైన్ కోసం తీసిన గోతుల్లో నీరు చేరి పనులకు విఘాతం కలిగిస్తోంది. ఇటు పం పుహౌస్, అటు పైపులైన్ పనులు పగలూ రాత్రి చేస్తున్నారు. భారీ యంత్రాలతో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని పోలీసు పహారా మధ్య పనులు నిర్వహిస్తున్నారు.

చిత్రం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపుహౌస్ నిర్మాణ పనుల దృశ్యం