ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణుల మధ్య చిచ్చుపెడ్తున్న జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 22: బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగడం ఓర్చుకోలేని ప్రతిపక్ష జగన్మోహనరెడ్డి బ్రాహ్మణ సమాజంలో ఎమ్మెల్యే కోన రఘుపతిని శకునిగా వాడుకుంటూ చిచ్చుపెడ్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ గుంటూరు జిల్లా కో-ఆర్డినేటర్ సిరిపురపు శ్రీ్ధర్ ఆరోపించారు. గురువారం స్థానిక బ్రాడీపేటలోని జిల్లా సంఘ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో శ్రీ్ధర్ మాట్లాడుతూ ఐవైఆర్ కృష్ణారావును చైర్మన్ పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారకుడు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ సమాజంలో కోన ఒక విషపు చుక్క అని ధ్వజమెత్తారు. సిఎం చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటి నుండి వైఎస్ జగన్ బ్రాహ్మణుల మధ్య వివాదాలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కోనను పావుగా వాడుకుంటున్నారని గతంలోనే తాను తెలియజేశానన్నారు. గతంలో కాపుల మధ్య గొడవలు పెట్టేందుకు ముద్రగడను వాడుకున్నారని, ఇప్పుడు కోన రఘుపతి రాజకీయ జీవితాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు జగన్ కుయుక్తులు పన్నుతున్నారన్నారు. గతంలో పలువురు బ్రాహ్మణులు మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రధానమంత్రులుగా పనిచేశారని వారిలో కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ గవర్నర్‌గా, స్పీకర్‌గా పనిచేశారన్నారు. అయితే ఆయా నాయకులు సంఘీయుల కోసం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయించి తొలిసారిగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు జంధ్యాల రామలింగేశ్వరశాస్ర్తీ, కో ఆర్డినేటర్లు నెమలికంటి హనుమంతరావు, మేడూరి శ్రీనివాసమూర్తి, జె సత్యనారాయణ, పవన్, ఉపదృష్ట రామకృష్ణ, శ్రీ్భష్యం రంగనాధ్ పాల్గొన్నారు.