ఆంధ్రప్రదేశ్‌

హౌసింగ్ ఎఇ అక్రమాస్తులు రూ.పది కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామభద్రపురం, మే 2: గృహనిర్మాణశాఖ ఎఇ రూ.పది కోట్ల మేరకు అక్రమాస్తులు కూడబెట్టారు. పక్కాసమాచారంలో ఏకకాలంలో పలు చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు అతని బంధువుల పేర ఉన్న భారీ భవంతులు, లాకర్లలోని బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో గృహ నిర్మాణశాఖ ఎఇగా పనిచేస్తున్న నడిమింటి సత్యం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో సోమవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రామభద్రపురం మండలం నాయుడువలసలోని సత్యం ఇంటివద్ద ఎసిబి సిఐ రమేష్, లక్ష్మోజి, సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు పాసుపుస్తకాలు, లాకర్‌కు సంబంధించిన విలువైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమ ఆస్తులపై సత్యంను సుధీర్ఘంగా విచారించారు. విశాఖపట్టణం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్, విజయనగరం ప్రాంతాల్లోని సత్యం బంధువుల ఇళ్లలో సైతం ఎసిబి అధికారులు సోదాలు జరిపి విలువైన భూములు, పాట్లను గుర్తించినట్టు ఎసిబి డిఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ రూ.కోటి ఉంటుందని, అయితే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. పది కోట్లకు పైబడి ఉంటుందని అధికారులు అంటున్నారు. సత్యంకు రామభద్రపురంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్, బ్యాంకు భవనం, మరికొంత భూమి ఉన్నట్టు గుర్తించారు. విజయనగరంలో 12 ఎకరాల పొలం ఉన్నట్లు డాక్యుమెంట్ల ద్వారా గుర్తించారు. అదేవిధంగా రామభద్రపురంలోని శ్రీ విశాఖ గ్రామీణ బ్యాంకు లాకర్‌లో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఇ సత్యంను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు రామకృష్ణ, రమేష్, రాజశేఖర్, సతీష్ పాల్గొన్నారు.
.