ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ హయాంలోనే కబ్జాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: విశాఖలో జరిగిన వైఎస్ జగన్ సభలో, ఆయన సమక్షంలోనే ఖాదర్ బాషా అనే వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో జరిగిన భూకబ్జాలను బట్టబయలు చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. లోకేష్‌పై బురద జల్లే ప్రయత్నంలో జగన్ తనపైనే బురద వేయించుకున్నారని గురువారం ఒక ప్రకటనలో కళా ఎద్దేవా చేశారు. గాజువాక నియోజకవర్గం వెంకన్నపాలెం గ్రామంలో ఖాదర్ బాషాకు ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటాలో కేటాయించిన భూమి వైఎస్ హయాంలోనే కబ్జాకు గురైందంటూ జగన్ సాక్షిగా సభలోనే బాషా వెల్లడించారని గుర్తుచేశారు. ఆర్థిక ఉగ్రవాది అయిన జగన్ పక్కన కూర్చుని సిపిఐ, సిపిఎం తమ విలువలు తగ్గించుకున్నాయన్నారు. విశాఖలో స్వాతంత్య్ర సమరయోధుల భూమి కుంభకోణంలో జగన్ పాత్ర ఉందని సిఐడి తేల్చిందని, అటువంటి వ్యక్తి పక్కన కూర్చుని ఈ పార్టీలు భూకబ్జాలను అరికడదామనడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై బురద చల్లాలని విశాఖలో మీటింగ్ పెట్టి, జగన్ తన తండ్రి చేసిన భూకబ్జాలను లోకానికి వెల్లడించారన్నారు. వైఎస్ హయాంలో విశాఖలో ఎన్నో కబ్జాలు జరిగాయని సిట్ కూడా వేయలేదని గుర్తుచేశారు. సిట్‌కు వైకాపా ఎందుకు ఆధారాలు చూడలేకపోతున్నది చెప్పాలని ప్రశ్నించారు.