ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై ఆరోపణలు రుజువు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: అగ్రిగోల్డ్ ఆస్తుల్ని తెలుగుదేశం నేతలు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంస్థ ఉపాధ్యక్షుడు సి కుటుంబరావు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే, ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. లక్షలాది మంది డిపాజిటర్ల జీవితాలతో ఆధారపడిన అంశంపై ముందూ, వెనుకా ఆలోచించకుండా ఆరోపణలు చేయడం విపక్ష నేతలకు మంచిది కాదని ఆయన హితవు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యంతో సిఐడి ద్వారా వేగంగా విచారణ జరిపించి కేవలం ఎనిమిది నెలల్లోనే ఆ సంస్థ ఆస్తుల్ని అటాచ్‌మెంట్ చేయించామన్నారు. ఈ కేసు ఉమ్మడి హైకోర్టు పరిధిలోకి వెళ్లాక, తమ ప్రభుత్వం న్యాయస్థానానికి సహాయకారిగా వ్యవహరిస్తోందే తప్ప ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదన్నారు.