ఆంధ్రప్రదేశ్‌

కాలేయంలోనూ సగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 22: కాలేయం దెబ్బ తిన్న తన భర్తను కాపాడుకునేందుకు ఓ భార్య తన కాలేయంలో సగమిచ్చి, భర్తకు ప్రాణదానం చేసింది. 22 మంది డాక్టర్ల బృందం ఓ అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి వీరిద్దరూ మళ్లీ కలకాలం జీవించేలా చేసింది. విశాఖకు చెందిన తాటికొండ సుందరరావు కాలేయం పూర్తిగా దెబ్బతింది. ప్రాణాపాయం దగ్గర పడింది. తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఎవరిని అర్థించాలో భార్య మాధురికి తెలియలేదు. అనుకోని రీతిలో ఈ విషయం విశాఖలోని కేర్ వైద్యులకు తెలిసింది. వెంటనే సుందరరావు, మాధురిని ఆసుపత్రికి పిలిపించి పరిస్థితిని తెలుసుకున్నారు. సుందరరావు కాలేయాన్ని పూర్తిగా తొలగించి, ఆ స్థానంలో మాధురి కాలేయం నుంచి 59 శాతాన్ని తీసుకుని సుందరరావుకు అమర్చితే ఇద్దరూ ప్రాణాలతో బయటపడతారు. ఈ విషయాన్ని డాక్టర్ల బృందం భార్య, భర్తలిద్దరినీ కౌన్సిలింగ్ చేశారు. ఇద్దరూ సరేననడంతో శస్తచ్రికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15న కేర్ ఆసుపత్రిలో 22 మంది సీనియర్ వైద్య బృందం 16 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి శస్త్ర చికిత్స చేశారు. రాష్ట్రంలోనే ఇది తొలిసారి అని కేర్ ఆసుపత్రి మెడికల్ డైరక్టర్ మోహన్ మహరాజ్ తెలియచేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. మాధురి నుంచి తీసేసిన 59 శాతం కాలేయం ఆరు వారాల్లో తిరిగి యథాస్థితికి చేరుకుంటుందని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ జి సత్యనారాయణ, పద్మావతి, లివర్ సర్జరీ స్పెషలిస్ట్ ప్రొ.టాం చెరియన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కాలేయం మార్పిడి చికిత్స అనంతరం డాక్టర్ల బృందంతో సుందరరావు దంపతులు