ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీ కోడిగుడ్లపై ప్రభుత్వ ముద్ర వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, జూన్ 22: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లపై ఇక నుండి ఐసిడిఎస్ సీలు వేస్తామని రాష్ట్ర స్ర్తి, శిశుసంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. గురువారం ప్రకాశం జిల్లా దర్శిలోని శివాలయం వీధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీకేంద్రంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారి ప్రతిభపాటవాలను పరిశీలించారు. చిన్నారులను ఒళ్లో కూర్చోపెట్టుకుని పలకపై అక్షరాలను దిద్దించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని కోడిగుడ్లను, ఉడికిన కోడిగుడ్లను పరిశీలించారు. అన్ని సజావుగా ఉండటంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులకు ఉడకబెట్టిన కోడిగుడ్లను, బిస్కెట్‌ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హాజరవుతున్నారని సూపర్‌వైజర్ నాగజ్యోతిని మంత్రి ప్రశ్నించగా, 23మందికిగాను 17మంది పిల్లలు వచ్చారని ఆమె సమాధానం ఇచ్చారు. మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణిచేసే కోడిగుడ్లపై ప్రభుత్వ ముద్ర వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ముద్రవేసిన తరువాత కోడిగుడ్లు బయట అమ్మేందుకు వీలులేకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వచ్చే ఆగస్టు ఒకటవతేదీ నుండి బాలామృతం పథకాన్ని అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన ఏడునెలల నుండి మూడు సంవత్సరాల లోపు వయస్సుకల పిల్లలు 16లక్షల మందికి వచ్చే ఆగస్టు ఒకవతేదీ నుండి మంచి పౌష్టికాహారాన్ని ఈ పథకం కింద అందిస్తామన్నారు. 7.55లక్షల మంది గర్భిణులకు అన్న అమృతహస్తం పథకాన్ని అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభించి 257ప్రాజెక్టుల ద్వారా గర్భిణులకు అందిస్తున్నామన్నారు. పుట్టబోయే పిల్లలు బలహీనంగా ఉండకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గర్భిణులకు అంగన్‌వాడీకేంద్రాల్లో నెలకు 25రోజులపాటు మంచి భోజనాన్ని ఏర్పాటుచేశామన్నారు. త్వరలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రీ స్కూలు విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

చిత్రం.. దర్శిలో అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సునీత