ఆంధ్రప్రదేశ్‌

భారీ జెండాను ఆవిష్కరించిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూన్ 22: జాతీయ జెండా స్ఫూర్తితో దేశం అభివృద్ధికోసం అందరూ సంఘటితం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్ట్ అథారిటీ రూ.15 లక్షల నిధులు వెచ్చించి 100 అడుగుల ఎత్తు, 20న30 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని రిమోట్ ద్వారా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జాతీయ స్ఫూర్తితో దేశం అభివృద్ధికోసం అందరం సంఘటితం కావాలన్నారు. జాతీయ జెండాను రూపొందించింది మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య అని గుర్తుచేశారు. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటుచేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్టణం, రేణిగుంటలో భారీ జాతీయ పతకాలు ఉండటంతో శ్రీవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు భారీ జాతీయ పతాకం చూడటంతో దేశభక్తి స్ఫూర్తి కలుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో రైల్వేస్టేషన్లలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ జాతీయ జెండాలు నెలకొల్పడం వలన దేశభక్తి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు.
చంద్రబాబు జెండా ఆవిష్కరించిన అనంతరం జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు. అయితే ముఖ్యమంత్రి వెనుక ఉన్న ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పరధ్యానంలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేయకుండా నిలబడడం కనిపించింది.

చిత్రం.. రేణిగుంట విమానాశ్రయంలో జాతీయ జెండాకు వందనం చేయకుండా నిలబడ్డ లోకేష్