ఆంధ్రప్రదేశ్‌

దమ్మిడి సాయానికి వంద లెక్కలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 2: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల పొత్తు కొనసాగుతుందని చెప్పలేని పరిస్థితులు నెలకొంటున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి సహాయం అందడంలేదన్నారు. రాష్ట్ర విభజన పాపంలో కాంగ్రెస్‌తోపాటు బిజెపికీ భాగం ఉందన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ ముందునుంచీ పాట పాడిన బిజెపి రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తే అందుకు పూర్తిగా సహకరించిందన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలుచేశారు. ప్రత్యేక హోదాకు నీతి ఆయోగ్ అంగీకరించడంలేదని చెబుతున్నరని, రాష్ట్ర విభజన చేయమని నీతి ఆయోగ్ చెప్పిందా అని ప్రశ్నించారు. పార్లమెంటు తలుపులు మూసేసి, రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తే, బిజెపి సహకరించలేదా అని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా, రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా అని రాజ్యసభలో చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడరని మండిపడ్డారు. దమ్మిడీ సాయానికి వంద లెక్కలు అడగడం దేనికని విమర్శించారు. ఎయిమ్స్ వంటి సంస్థలకు స్థలం, వౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే పథకాలకు వంద కోట్ల లోపు నిధులు కేటాయిస్తే అవి ఎప్పటికి పూర్తవుతాయని ప్రశ్నించారు. 30 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లినా ఫలితంలేదని, ఇక ముఖ్యమంత్రి వాళ్ల పాదాలకు మొక్కాలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఇందిరాగాంధీ, సోనియా గాంధీలు ఫలితం అనుభవించారని, ఇప్పుడు వేరేవారికి అదే గతి పడుతుందని బిజెపిపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ వౌనం వీడితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరించారు. రాజధానికి నిధులు అంటూ సన్నాయి నొక్కులు తప్ప పైసా విదల్చడంలేదన్నారు. మరో ఉద్యమం రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తపడి నిధులు ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపి మాగంటి మురళీమోహన్ పాల్గొన్నప్పటికీ, వేరే పనులున్నాయని మధ్యలోనే వెళ్లిపోయారు. రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీశేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు