ఆంధ్రప్రదేశ్‌

ఇదీ.. జిఎస్‌టి ప్రభావం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: దేశ వ్యాప్తంగా జూన్ 30 అర్ధరాత్రి నుంచి అమలు కానున్న జిఎస్‌టి వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగునున్నాయి. కొన్నింటి ధరలు తగ్గనున్నాయి. కొన్ని వస్తువుల ధరలు 0.5 శాతం నుంచి 27 శాతం వరకూ తగ్గనున్నాయి. దుప్పట్లు, దోమతెరలు, రగ్గులు, టెరికాటన్ టవల్స్, ఖండసారి చక్కెర, ఎంబ్రాయిడరీ, బిస్కట్లు, వెన్న, కేక్స్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఎల్‌పిజి గ్యాస్ (నాన్-డొమెస్టిక్), సెల్‌ఫోన్ పరికరాలు, యాక్ససరీస్, పళ్ల రసాలు, గాగుల్స్, కిరోసిన్ స్టవ్, కంటి అద్దాలు, ఆర్థోపెడిక్ పరికరాలు, కుట్టుమిషన్లు, సాస్, సర్జికల్ ఇంప్లాంట్స్, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు, బొగ్గు, ఔషధాలు, సిసి టివి కెమెరాలు, విద్యుత్ బల్బులు, హెయిర్ ఆయిల్స్, నాన్-బ్రాండెడ్ గోధుమ పిండి, బియ్యం, తృణధాన్యాలు, మైదా, ధాన్యం, పాపడ్, పప్పులు, రవ్వ, బియ్యం, దుప్పట్లు, దోమతెరలు, సెట్ టాప్ బాక్స్, షూస్, టాయిలెట్ సోప్స్, సుగర్ కనె్ఫక్షనరీ, టూత్ పేస్టు, యుపిఎస్ సిస్టమ్స్, జ్యుయలరీ (విలువైన లోహాలు), కార్పెట్స్, చీపుర్లు, ప్లాస్టిక్ గాజులు, సైకిళ్లు, ఆటోల టైర్లు, ట్యూబ్‌లు, ఇమిటేషన్ జ్యూయలరీ, దేశీయ సంగీత వాద్యాలపై పన్ను తగ్గనుంది. బీడి, నమిలే పొగాకు, గుర్రాలు, హెన్నా, ప్లాస్టిక్ ఫర్నిచర్, ప్రెజర్ కుక్కర్లు, పచ్చళ్లు, కెచప్, కాటన్ వస్త్రాలుపై పన్ను పెరుగుతుంది. ఒక శాతం, అంతకన్నా తక్కువ పెరిగిన వస్తువులు 180 దాకా ఉన్నాయి. దీని వల్ల ధరల్లో పెద్దగా తేడా ఉండదు. మ్యూజిక్ సిస్టమ్స్, క్యాసెట్లు, సిడిలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ ఫూరిఫైయర్లు, ఏరేటెడ్ డ్రింక్‌లు, ఆటోమొబైల్స్, ఆయుర్వేదిక్, యునాని, హోమియో ఔషధాలు, బాడీ స్ప్రేలు, కెమెరాలు, సిమెంట్, సిరమిక్ టైల్స్, డియోడరెంట్స్, డిటర్జెంట్ పౌడర్, సోప్, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ గ్రైండర్, ఎలక్ట్రికల్ రేజర్లు, ఫేస్ క్రీమ్స్, లోషన్స్, హెయిర్ డ్రయర్, హెయిర్ డై, హెల్త్ ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్, జామ్, లిప్ట్స్, ఎలివేటర్లు, మార్బల్, రిఫ్రిజిరేటర్లు, షేవింగ్ క్రీం, టాల్కమ్ పౌడర్, టెలివిజన్, వ్యాకూమ్ క్లీనర్, వాషింగ్ మెషిన్లు, చేతి గడియారాలు, యాస్‌బెస్టాస్ షీట్లు, కంప్యూటర్, కంప్యూటర్ యాక్సెసరీస్, అగర్‌బత్తి, కాఫీ, ఉప్పు, ఎండు మిరపకాయలు, బెల్లం, మసాలా పౌడర్లు, ఇసుక, సుగంధ ద్రవ్యాలు, చింతపండు, పసుపు, టీపై జిఎస్‌టి ప్రభావం పెద్దగా ఉండదు.