ఆంధ్రప్రదేశ్‌

అమరావతి డిక్లరేషన్ ముసాయిదా రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: మహిళా సాధికారతకు సంబంధించిన అమరావతి డిక్లరేషన్ ముసాయిదా సిద్ధమైందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమం వద్ద ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌లో పాల్గొన్న రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు, యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు, చర్చలు, సిఫార్సులు, తీర్మానాలకు సంక్షిప్త రూపమే అమరావతి డిక్లరేషన్ అని వివరించారు. మహిళా పార్లమెంట్‌లో అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళలతోపాటు దాదాపు 25వేల మంది పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన, సిఫారసు చేసిన అంశాలకు సంక్షిప్త రూపం ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు దీన్ని రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులతో పది అంశాలతో కూడిన ఒక ముసాయిదాని తయారుచేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో స్ర్తి విద్య, మహిళల న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం, సమతుల ఆహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళల సామాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర, మహిళల సామాజికాభివృద్ధి, మహిళల డిజిటల్ విద్య అనే అంశాలు ఉన్నట్లు వివరించారు. ముసాయిదాను రూపొందించడంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితదావ్రా ఎంతో కృషి చేసినట్లు ప్రశంసించారు. 8 మంది ప్రముఖ మహిళలు ఈ ముసాయిదాను అంశాలవారీగా మూడుగంటల పాటు పరిశీలించి, చర్చించి, మార్పులు చేర్పులు చేసి తుది రూపం ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వివాదాలకు తావు లేకుండా విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను తయారు చేసినట్లు చెప్పారు. తుది ప్రకటన ముద్రణ పూర్తయిన తరువాత దీన్ని రూపొందించడంలో కృషిచేసిన మహిళల సమక్షంలో త్వరలో ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని స్పీకర్ చెప్పారు.
అంతకుముందు సుమిత దావ్రా మాట్లాడుతూ మహిళా పార్లమెంటులో దాదాపు 12వేల మంది విద్యార్థినులు పాల్గొన్నట్లు చెప్పారు. 14 మంది ప్రముఖ మహిళల ప్రసంగాలతోపాటు విద్యార్థినుల ప్రసంగాల్లో ముఖ్యమైన వాటితో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనూరాధ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు సూచనలు, సలహాలు అమరావతి ప్రకటనలో ఉంటాయని చెప్పారు. ఎండోమెంట్స్ కమిషనర్ అనూరాధ మాట్లాడుతూ ఈ ప్రకటన రూపకల్పనలో తనను కూడా భాగస్వామిని చేయడం గొప్ప భాగ్యంగా భావించారు. శాసనమండలి వైస్ చైర్మన్ మండలి బుద్దప్రసాద్, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్‌గుప్త కూడా పాల్గొన్నారు.
మహిళా సాధికారత కోసం రూపొందించిన అమరావతి ప్రకటనకు తుది రూపం ఇచ్చేముందు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం స్పీకర్ చాంబర్‌లో సమావేశమైన పది మంది సభ్యులు ప్రకటన ముసాయిదాలోని పది అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి అంశంలోని విషయాలను అమూలాగ్రం చర్చించారు.

చిత్రం.. అమరావతి డిక్లరేషన్ వివరాలు తెలియచేస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు