ఆంధ్రప్రదేశ్‌

జగన్ ధర్నాకు స్పందన కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: కరవుపై వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. మాచర్లలో జగన్ తలపెట్టిన ధర్నాకు వైకాపా నాయకులు తప్ప ప్రజలెవరూ రాలేదన్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రిని కలిసిన జగన్ రాష్ట్ర కరవుపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 369 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిందని, కరవు నివారణకు నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిందని చెప్పారు. కరవు నివారణలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందన్నారు. టిడిపి చేపట్టిన ‘నీరు-చెట్టు’ కార్యక్రమంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టిందని తెలిపారు. తాగునీటి కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందని ఆయన వివరించారు.