ఆంధ్రప్రదేశ్‌

బాబు సమక్షంలో కర్నూలు పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం తన నివాసంలో సమావేశమయ్యారు. వైకాపానుంచి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని శిల్పా సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలం కిందట తులసిరెడ్డిపై జరిగిన దాడిలో భూమావర్గం హస్తం ఉందని శిల్పా వర్గీయులు ఆరోపిస్తూ వస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ రెండు వర్గాలతో చంద్రబాబు నాయుడు మంగళవారం సమావేశమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలని అన్నారు. విభేదాలను పక్కనపెట్టి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. అయితే, ఈ సమావేశం కొంత హాట్ హాట్‌గానే జరిగినట్టు తెలుస్తోంది. ఇరువర్గాల నాయకులను చంద్రబాబు తీవ్రంగానే హెచ్చరించినట్టు భోగట్టా!
కార్యకర్తలు నలిగిపోకూడదు : శిల్పా నాగిరెడ్డి
భూమా నాగిరెడ్డి, తాము కలిసిపోతే సరిపోదని, కార్యకర్తలు కూడా కలవాలని శిల్పా నాగిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘నంద్యాల నియోజకవర్గ సమస్యల గురించి ముఖ్యమంత్రి తమతో చర్చించారు. వాటిని పరిష్కరిస్తామని అన్నారు. నాయకులు మనస్ఫూర్తిగా కలవాలి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కూడా కార్యకర్తలను కలుపుకొనిపోవాలని ఆయన కోరారు. శిల్పా చక్రపాణి మాట్లాడుతూ సమన్వయంతో పనిచేస్తామని భూమా నాగిరెడ్డి, తాము కూడా చంద్రబాబుకు చెప్పామని అన్నారు. కార్యకర్తల మధ్య వైషమ్యాలు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లావ్యాప్తంగా వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి రావాలని చూస్తున్నారని, అయితే, ఇప్పుడు కొత్తగా టిడిపిలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఏవిధంగా కార్యకర్తలను, నాయకులను కలుపుకొనిపోతున్నారు? తదితర అంశాలను వారు పరిశీలిస్తున్నారని అన్నారు.
కలిసి పనిచేసుకుంటాం: భూమా
భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ శిల్పా వర్గంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తామంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.
టిడిపిలోకి ఏరాసు
ఇదిలా ఉండగా మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితోపాటు పాణ్యం నియోజకవర్గానికి చెందిన వైకాపా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంబ్రాబు నాయుడు సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.