ఆంధ్రప్రదేశ్‌

పోలవరంతో డెల్టా స్థిరీకరణ అనివార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 24: పోలవరం ప్రాజెక్టు నేపధ్యంలో గోదావరి డెల్టాలకు స్థిరీకరణ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా అదనంగా సుమారు 650 టిఎంసిల నీటి వినియోగానికి ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టింది. శ్రీరాంసాగర్, యల్లంపల్లి దిగువన వున్న ప్రాణహిత, ఇంద్రావతి నదుల ద్వారా ఏటా 2వేల టిఎంసిల నీరు దిగువకు ప్రవహించి ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రంలో కలుస్తోంది. డెల్టాలలో తప్ప అంతగా నీరు వినియోగం లేదు. గోదావరి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు 1480 టిఎంసిలు. అందులో తెలంగాణాకు 930, ఆంధ్రప్రదేశ్‌కు 550 టిఎంసిలు. విభజన దినం జూన్ 2, 2014 నాటికి ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రతిపాదనలో వున్న ప్రాజెక్టులకు తెలంగాణాలో 950, ఆంధ్రప్రదేశ్‌లో 625 టిఎంసిలు చూపించినట్టు తెలుస్తోంది. ఇందులో మళ్లీ గోదావరి డెల్టా నుంచి 42, పోలవరం ప్రాజెక్టు ద్వారా 62 టిఎంసిలు మొత్తం 104 టిఎంసిలు భూగర్భ జలాల నుంచి వినియోగించుకునేలా సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు నికరంగా 520 టిఎంసిలు మాత్రమే. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పరిశీలిస్తే..2005 నుంచి 2016 వరకు జూలైలో 334, ఆగస్టులో 1280, సెప్టెంబర్‌లో 965, అక్టోబర్‌లో 326, నవంబర్‌లో 92 టిఎంసిల నీరు ప్రవహించినట్టుగా ఉంది. అంతేకాకుండా ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు లక్ష క్యూసెక్కుల నీరు చేరిన దాఖలు తక్కువగా ఉన్నాయి. దుమ్ముగూడెం ఎగువన సుమారు 70 వేల క్యూసెక్కుల నీటిని తరలించడం వల్ల వరదల సమయంలో కాక గోదావరిలో నీరు తక్కువ ఉన్నపుడు భద్రాచలం దిగువకు నీరు అతి తక్కువగా చేరుతోంది. ఎగువ రాష్ట్రాల వాళ్లు తలచిన విధంగా ప్రాజెక్టులు డిజైనింగ్ చేయడం వల్ల దిగువ గడ్డు పరిస్థితే. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు లోబడి రివర్ బోర్డు అనుమతులు పొందిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు చేపట్టే విధంగా వత్తిడి తేవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరి లేకపోతే కృష్ణ లేదు.. ఆంధ్రప్రదేశ్‌కు గోదావరే ఆధారం. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి 1480 టిఎంసిలు కేటాయించారు. ఇందులో వాడకుండా మిగిలింది 680 టిఎంసిలు, దాంట్లో 335 టిఎంసిలు పోలవరానికి కేటాయించారు. పోలవరం నుంచి 80 టిఎంసిలు కృష్ణాకు తీసుకెళ్తారు. కృష్ణాకు చేరిన నీళ్లలో కృష్ణా నది నీళ్లుగా పరిగణిస్తారు. అందులో కర్నాటక, మహారాష్టక్రు కూడా అధికారం ఉంది. కృష్ణాకు చేరే 80 టిఎంసిలలో 35 టిఎంసిలు వాళ్లు తీసుకోగా, 45 టిఎంసిలు మనకు వస్తాయి. గోదావరి జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణాపై పరస్పర ఆమోదయోగ్యంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.