ఆంధ్రప్రదేశ్‌

బొత్స అవినీతిని రుజువు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 25: వైకాపా నేత బొత్స సత్యనారాయణపై ఏ ఆరోపణలు ఉన్నాయో వాటిని నిరూపిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చే విధంగా ఏ అంశం మీద విచారణ జరిగిందో ఆ రికార్డులను కాల్చేసిన విషయం ప్రజలు మరచిపోలేదని అన్నారు. తనకు రిమోట్ కంట్రోల్ రాజకీయాలు చేతకాదన్నారు. ఏ బినామీలను అడ్డం పెట్టుకొని బొత్స అవినీతికి పాల్పడ్డారో, ఆ నిజాలు దర్యాప్తులో బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయా ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. బొత్సతోపాటు మిగిలిన నేతల చరిత్ర కూడా బయటకు వస్తుందన్నారు. నిజాయితీగా ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై కూడా అవినీతి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. అశోక్‌గజపతిరాజు పారదర్శకంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను ఖర్చు చేస్తున్నారన్నారు. బొత్స, ఆయన సతీమణి ఎంపిలుగా ఉన్నప్పుడు పనులు చేయకుండానే ఎంపీ ల్యాడ్స్ నిధులను పర్సంటేజీలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇవన్నీ త్వరలోనే రుజువు అవుతాయని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వైకాపా నేత జగన్ తెలంగాణలో ఉంటూ ఎపిలో రాజకీయాలు చేస్తున్నారో అదేబాటలో బొత్స కూడా హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడ నేతలతో రాజకీయాలు నడిపిస్తే ప్రజలు హర్షించరని సుజయ్ అన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నా ఏం అభివృద్ధి జరగలేదని పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. పట్టణంలో రూ.85 కోట్లతో బైపాస్ నిర్మాణం, 18 కోట్లతో సంతకాల బ్రిడ్జి నిర్మాణం, రూ.130కోట్లతో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆయనకు కన్పించలేదా అని ప్రశ్నించారు.