ఆంధ్రప్రదేశ్‌

టిడిపి పాలనపై కాంగ్రెస్ చార్జ్‌షీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: టిడిపి మూడేళ్ల పాలనపై కాంగ్రెస్ పార్టీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. టిడిపి, బిజెపి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని, రాష్ట్రంలో టిడిపి విశృంఖల దోపిడీకి తెరతీసిందని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోపించారు. పిసిసి ఆదేశాల మేరకు ‘దోపిడీ బాబు’ పేరిట ఛార్జ్‌షీట్‌ను ఆయన విశాఖలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన మూడేళ్లలో టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. విశాఖలో వెలుగు చూసిన వేల కోట్ల భూ కుంభకోణంపై టిడిపి నోరు మెదపట్లేదని ఆరోపించారు. భూ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని విపక్షాలు కోరుతోంటే ప్రభుత్వం మాత్రం సిట్ విచారణ పేరిట కాలయాపన చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇక బిజెపితో కలిసి ఎన్నికల్లో పోటీచేసిన సందర్భంలో ఈ రెండు పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మూడేళ్లు గడచినప్పటికీ ప్రత్యేక హోదా లేదని తేల్చేశారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ టిడిపి, బిజెపి ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. ప్యాకేజీలోనూ కేంద్రం కోత విధించిందని, ఈ విషయాన్ని టిడిపి ఎందుకు నిలదీయట్లేదని ప్రశ్నించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో బిజెపి, టిడిపి నగర ప్రజలను దారుణంగా వంచించాయన్నారు. రైల్వే జోన్ ప్రకటించకుండా తాత్సారం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులను రాబట్టే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారన్నారు. కేంద్రాన్ని నిలదీసే విషయంలో చంద్రబాబు ఎందుకు వెనుకంజవేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.