ఆంధ్రప్రదేశ్‌

ధన ప్రమేయాన్ని అరికట్టాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: అభివృద్ధి చేసే ప్రభుత్వానికే అన్ని విధాలా మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను కార్యకర్తలతో అన్న మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యులతో అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం పార్టీ ముఖ్యులతో సమావేశమైన ముఖ్యమంత్రి కర్నూలు సభలో తన ప్రసంగంపై దుమారం రేగడాన్ని ప్రస్తావించారు. పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు ఓటేయాలనేది తన వ్యాఖ్యల ఉద్దేశమని వివరించారు. అయోగ్యులకు ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి తల్లకిందులవుతుందని, ఎన్నికల్లో డబ్బుకు ఆశపడి ఓట్లు వేయొద్దనేది తన మాటల అంతరార్థమని చెప్పారు. తన వ్యాఖ్యలను ఒక వర్గం పత్రికలు, న్యూస్ చానళ్లు వక్రీకరించి ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయాలను తీసుకెళ్లడం సరికాదని ముఖ్యమంత్రి ఖండించారు. వాస్తవానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని చెప్పారు. పోలవరం, అమరావతి వంటి మహోన్నత నిర్మాణాలను భుజానికెత్తుకున్న ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన మీడియా ఒక వర్గం ప్రయోజనాలకు కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదన్నారు. మంచి చేసే ప్రభుత్వాలను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ప్రయోజనాలు చేకూర్చడానికి వీలవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. తమ రాతలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా మీడియా నడుచుకోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. పెన్షన్లను ఐదురెట్లు పెంచడం, 24గంటల విద్యుత్ అందించడం వంటి ప్రభుత్వ విజయాల్లో కొన్నింటినైనా మీడియా గుర్తించాలని కోరారు. విభజన తరువాత రాష్ట్రం వున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత భారీగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, అమలుచేయడం మరెవ్వరూ కూడా చేయడానికి సాహసించరని, ఒక స్పష్టమైన విజన్‌తో ధైర్యంగా ముందుకెళ్తున్నామని చంద్రబాబు అన్నారు. నోట్లు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలవాలని చూసే రాజకీయ పక్షాల ఆట కట్టించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై ఒక వర్గం మీడియా కక్షపూరితంగా దుష్ప్రచారం చేస్తోందని పార్టీ నేతలు కూడా ముఖ్యమంత్రి వద్ద తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు