ఆంధ్రప్రదేశ్‌

పంచవర్ష ఇంధన సమర్థ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత ఇంధన సమర్థ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టనున్నది. దీనిలో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థల భవనాలను ‘స్టార్’ భవనాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇకపై ప్రభుత్వ సంస్థల్లో ఇంధన సమర్థ 5 స్టార్ రేటింగ్ ఉపకరణాలను అమర్చనున్నారు. విద్యుత్ ఆదా చేయడంతో కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోనున్నారు. ప్రభుత్వ భవనాల్లో స్టార్ రేటెడ్ ఉపకరణాల వలన చేకూరే లాభాలను అర్థం చేసుకుని ఉద్యోగులు దీనిని ఆచరణలో పెట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు కూడా ఇళ్లలో 5 స్టార్ రేటింగ్ ఉన్న ఉపకరణాలనే వాడటం వల్ల పెద్ద మోతాదులో విద్యుత్ పొదుపు చేయవచ్చని, తద్వారా కరెంట్ బిల్లుల ఖర్చును తగ్గించుకునేందుకు మంచి అవకాశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ చెప్పారు. తక్కువ ధరలకే 3, 5 స్టార్ల ఉపకరణాలను ప్రజలకు అందించే ఉజాలా పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లయ్, పంచాయితీరాజ్, ప్రాథమిక, ఉన్నత విద్యా రంగాల్లో, రహదారులు, భవనాలు, రవాణా, వ్యవసాయం వంటి అన్ని ముఖ్య విభాగాల్లో ఇంధన వనరుల పొదుపును చేపట్టవలసిన చర్యల గురించి సమగ్రమైన విధానంతో పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేయనున్నారు. ఫలితంగా సాలీనా 15,100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చు. ఇందువల్ల అన్ని ప్రభుత్వ విభాగాలు ఇంధనాన్ని పొదుపు చేయడమే కాక తక్కువ విద్యుత్ బిల్లులతో ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. సోమవారం వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ పై విషయాలను తెలిపారు. ఇందుకు గాను అన్ని శాఖలు ఎనర్జీ కో ఆర్డినేషన్ సెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ యంత్రాంగాల్లో ఇంధన సమర్థత, ఇంధన పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను అమలుచేయాలన్నారు. 3, 5 స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలను వినియోగదారులకు అందించేలా చూడాలని ముఖ్యమంత్రి నిర్దేశించారన్నారు. సాంప్రదాయ విద్యుత్ విధానంలో ఉపయోగించే ఉపకరణాలకు బదులు ఎల్‌ఈడి ట్యూబ్‌లైట్లు, ఇంధన సమర్థత ప్యాన్లు, ఏసీలు, సోలార్ వాటర్ హీటర్లు, సోలార్ రూఫ్ టాప్ సిస్టం, సోలార్ మోటార్ పంపుసెట్ల వాటిని ఉపయోగించినట్లయితే దాదాపు 35 శాతానికి పైగా విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. మూడు నెలల్లోపు విద్యుత్ గణాంకాలను (ఆడిట్) పూర్తిచేసి ఈ మార్గదర్శకాలను ఆచరించాలన్నారు. ప్రతి విభాగం ఇందుకు గాను ఒక బాధ్యతాయుతమైన నోడల్ ఆఫీసర్‌ను నియమించుకోవాలన్నారు. ఇప్పటికే గృహ వినియోగదారులకు ఎల్‌ఈడి బల్బులను అందించడం, అన్ని మున్సిపాల్టీల్లోనూ ఎల్‌ఈడి వీధి దీపాలను అమర్చడమే గాక, అనేక ఇంధన సమర్థ పథకాలను అమలు చేయడంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం గుర్తింపు పొందిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ ఇంధన సమర్థ చర్యలను చేపట్టి దేశానికే ఆదర్శవంతం కావాలని ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేశారు.
ఇలాఉంటే ఇటీవల జరిగిన ఒక సమావేశంలో భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వ విభాగాలకు 5స్టార్ రేటింగ్‌తో కూడిన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, వాటర్ పంపుసెట్లు కొనుగోలు చేసుకునేలా త్వరలోనే విడుదల చేస్తామని విద్యుత్‌శాఖ మంత్రి కళావెంకట్రావు చెప్పినట్టు ఇంధన, ఐ అండ్ ఐ, సిఆర్‌డిఎ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువచ్చారు. కాగా ప్రధాన కార్యదర్శి ఆదేశాలకు వెంటనే స్పందిస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.అనంతరాము (ఎఫ్‌ఏసి), పి.సిసోడియా, ఎస్‌ఎస్ రావత్‌లు జూలైలోగా తమ శాఖలకు సంబంధించిన వెయ్యి పాఠశాలలు, వసతి గృహాల్లో ఆడిట్‌ను నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలను సమర్పిస్తామని తెలిపారు.