ఆంధ్రప్రదేశ్‌

వర్షపు నీటి సద్వినియోగంతో కరవు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 27: ఈనెలలో ఇప్పటివరకు 32 శాతం అధిక వర్షపాతం పడిందని, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల రిజర్వాయర్లన్నీ నీటితో నిండితే మన కష్టాలన్నీ గట్టెక్కినట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి’ పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్, జూలైలో పడే వర్షాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ‘నీరు-ప్రగతి’ ఉద్యమం ఫలప్రదం కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టులో వర్షాభావం ఏర్పడిన్పపుడు చేపట్టాల్సిన డ్రైస్పెల్ మిటిగేషన్ చర్యలపై ఇప్పటికే రిహార్సల్ చేస్తున్నామన్నారు. నేలపై పడ్డ ప్రతి వర్షపు చుక్క భూమిలోకి ఇంకిస్తే కరవు అనేదే ఉండదన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు ఇంకా 12 మీటర్లు ఎగువకు రావాల్సి ఉందన్నారు. జల సంరక్షణ పనుల్లో అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ‘పంట సంజీవని’ని రైతులు ఆహ్వానించడం సంతోషకర పరిణామం అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పంటకుంటల తవ్వకంలో రైతుల్లో పోటీతత్వం పెరిగిందని, దీన్ని అందరూ సద్వినియోం చేసుకోవాలని కోరారు. నరేగా కింద ఇంకా రూ.800 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ నిధులు ఉన్నాయంటూ, వాటిని పూర్తిగా వినియోగించాలన్నారు. దశాబ్దం తరువాత జూన్‌లోనే కృష్ణా, గోదావరి డెల్టాలకు సాగునీటిని ఇస్తున్నామని, 5వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. సాగునీటి నిర్వహణలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది గొప్పగా పనిచేశారని కితాబిచ్చారు. చెరువులను కాపాడుకోవాలని, వాటిని నిర్లక్ష్యం చేయరాదని అన్నారు.
పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి
అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని గ్రామాలు, వార్డుల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఆదేశించారు. డ్రెయిన్ల పూడికతీత, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యమైన, ఆనందమయ సమాజం ఏర్పాటే మనందరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. గ్రామాలు, వార్డుల్లో శానిటరీ డ్రైవ్‌లు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తాగునీటి వనరులను పరిశుభ్రపరచాలని, ఓవర్‌హెడ్ ట్యాంకులన్నీ శుభ్రం చేయాలని, రక్షిత తాగునీటిని అందించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది సిమెంటు రోడ్లు మరో 6వేల కిమీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎస్సీ కాలనీల్లో అప్రోచ్ రోడ్లు కూడా సిసి రోడ్లే వేయాలని సూచించారు.
ఓడిఎఫ్ అయితే
అంటువ్యాధుల బెడద ఉండదు
ఈ ఏడాది మరో ఐదు జిల్లాలను ఓడిఎఫ్ (బహిరంగ విసర్జన రహిత)గా ప్రకటించాలని లక్ష్యంగా నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2018 డిసెంబర్ కల్లా రాష్ట్రం మొత్తం ఓడిఎఫ్ కావాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. బహిరంగ విసర్జనలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారితే అంటువ్యాధుల బెడద పూర్తిగా తొలగిపోతుందని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో దేశంలోనే విజయనగరం జిల్లా ముందంజలో ఉందని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించడం గొప్ప విషయంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని 71 గ్రామాల్లో 100 గంటల్లో 10వేల మరుగుదొడ్లు నిర్మించడం స్ఫూర్తిదాయకం అన్నారు.
తలసరి ఆదాయంలో పొరుగు రాష్ట్రాల కన్నా రూ.36వేలు దిగువ ఉన్నామని, దీన్ని పెంచేందుకు ప్రభుత్వపరంగా అనేక చర్యలు చేపట్టామని, వీటన్నింటిలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో జలవనరులు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, జవహర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, వివిధ జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.