ఆంధ్రప్రదేశ్‌

రైళ్ళలో గ్రీన్ టాయలెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 27: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛ్భారత్ వంటి లక్ష్యాల సాధన కోసం రైళ్ళల్లో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ టాయ్‌లెట్’ విధానం చక్కటి ఫలితాలు సాధించింది. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అత్యంత అధునాతన పద్ధతిలో అందుబాటులోకి వచ్చిన గ్రీన్ టాయ్‌లెట్ల వలన రైల్వేట్రాక్ ఎల్లపుడూ పరిశుభ్రంగా ఉంటోంది. కోచ్‌ల్లో ఉండే సాధారణ టాయ్‌లెట్లతో రైల్వేట్రాక్‌లు అధ్వాన్నంగా మారడం, అపరిశుభ్రత, నిత్యం శుభ్రపరిచినా ఎటువంటి ఫలితం కనిపించకపోవడం, అత్యధికంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఉపయోగించడం, నిధులు వెచ్చించే పరిస్థితులు రైల్వేకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. అలాగే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటినీ అధిగమించడంలో భాగంగా ఇప్పటికే అమలవుతున్న స్వచ్ఛ్భారత్‌కు సంబంధించి విశాఖ రైల్వేస్టేషన్ భారతీయ రైల్వేలోనే నెంబర్ స్థానాన్ని సాధించగలిగింది. దీనికి గ్రీన్ టాయ్‌లెట్ల నిర్వహణ ఒక కారణమని చెప్పవచ్చు. ఈ విధమైన గ్రీన్ టాయ్‌లెట్లను మరింతగా విస్తరించాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే అతి ముఖ్యమైన ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలో పలు రైలు కోచ్‌ల్లో గ్రీన్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేయగలిగింది. ఈ జోన్‌లో సంబల్‌పూర్, ఖుర్దా, వాల్తేరు డివిజన్లు ఉండగా, ఇందులో ఒక్క వాల్తేరుడివిజన్ పరిధిలోనే 300 కోచ్‌ల్లో గ్రీన్ టాయ్‌లెట్లు ఏర్పాటుకాగా, ఇందులో ఇప్పటికే 200కు పైగా కోచ్‌ల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కోచ్‌ల్లో దశలవారీగా వీటిని ఏర్పాటు చేసే చర్యలు వేగవంతమయ్యాయి. 2020 నాటికి భారతీయరైల్వే పరిధిలో నడిచే ప్రతి రైలులో గ్రీన్ టాయ్‌లెట్లను నూరు శాతం ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డు లక్ష్యంగా చేసుకుంది. ముంబయి, చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఎర్నాకులం, కోల్‌కతా, మధురై, వారణాసి, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ముఖ్య నగరాల్లో గ్రీన్ టాయ్‌లెట్ల వినియోగంపై ప్రయాణికుల్లో అవగాహన కల్పించడం, ఆయా డివిజన్ల పరిధిలో నడిచే రైళ్ళల్లో రానున్న ఏడాది కాలంలో 50 నుంచి 60 శాతం మేర వీటిని ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు సంబంధితాధికారి ఒకరు తెలిపారు.