ఆంధ్రప్రదేశ్‌

9.11 కోట్ల మొక్కలు నాటుతాం: శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: వన మహోత్సవ కార్యక్రమాన్ని జూలై తొలి వారంలో రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో రాష్టవ్య్రాప్తంగా 9.11 కోట్ల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. వీటిలో 6 మాసాల వయస్సు గల మొక్కలు 7.27 కోట్లు, రెండు సంవత్సరాలు పైబడిన 1.84 కోట్ల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో ఈకో-టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో ఈకో-టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వీటిని విశాఖ ఏజెన్సీలోని అరకు- సుంకరమిట్ట - అనంతగిరి, పశ్చిమ గోదావరి జిల్లా మారేడుమిల్లి, గుంటూరు జిల్లా ముత్యాలపాలెం (సూర్యలంక బీచ్ దగ్గర), పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో కూడా ఒక జూ పార్కును అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందించవలసిందిగా అధికారులను కోరారు. దీనికి సంబంధించి జూ అథారిటీ ఆఫ్ ఇండియా (జాప్)తో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో పడుతున్నందున అటవీ ప్రాంతంలో సీడ్ బాల్ టెక్నాలజీ ద్వారా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరారు. ఇటీవల అటవీ శాఖలో జరిగిన బదిలీల్లో (్ఫరెస్టు రేంజర్లు, డిఎఫ్‌ఓలు) బాధ్యతలు స్వీకరించిన, స్వీకరించని వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడ్డ వాహనాల వివరాలు అందజేయవలసిందిగా పిసిసిఎఫ్‌ను మంత్రి ఆదేశించారు. ఎర్ర చందనం విక్రయాలపై ప్రచారం నిర్వహించేందుకు ఒక బృందాన్ని జూలై ఒకటో తేదీన చైనా పంపుతున్నట్లు తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశంలో పిసిసిఎఫ్ సారంగి, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి మల్లికార్జునరావు పాల్గొన్నారు.