ఆంధ్రప్రదేశ్‌

రైతుల్ని ఇబ్బంది పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: ఉత్తరాంధ్ర జిల్లా ల్లో పంటల ఉత్పాదకత భారీగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సగటుతో పోలిస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పంటల ఉత్పాదకత తక్కువగా ఉందని, గిరిజన ప్రాంతాల్లో మరీ తక్కువగా ఉందని... ఈ నెల 24న విజయనగరం జిల్లా పార్వతీపురంలో వ్యవసాయ ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వెల్లడైనట్టు మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఒక్క వరి పంటే తీసుకుంటే... రాష్ట్ర సగటు సెక్టారుకు 5,622 కిలోలుండగా, శ్రీకాకుళంలో జిల్లాలో 4,400 కిలోలు, విజయనగరం జిల్లాలో 4,556 కిలోలు, విశాఖపట్నం జిల్లాలో 3,074 కేజీలుగా ఉందన్నారు. అదే ఐటిడిఎల్లో జరుగుతున్న ఉత్పత్తిని తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో మూడు వేల కిలో లు, విజయనగరంలో 3,600 కిలోలు, విశాఖపట్నంలో 2196 కేజీలుగా ఉందన్నారు. సాంప్రదాయ వ్యవసాయ విధానాలనే నమ్ముకోవడం, అధికోత్పత్తి సాధించే విత్తనాలు వినియోగించకపోవడం, ఉద్యానవన పంటలు పండే ప్రాంతాల్లో ఆహార పంటలు పండించడం వంటి కారణాలతో అధికోత్పత్తి సాధించలేకపోతున్నట్లు గుర్తించామన్నారు. సాగు యంత్రా లు కొనుగోలు చేయాలనుకున్న గిరిజన రైతులకు 90 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించామని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేయాలనుకునే వారికి 100 శాతం రాయితీ, స్ప్రింక్లర్ల ద్వారా సాగు చేసే వారికి 75 శాతం రాయతీ కల్పించనున్నట్టు చెప్పారు. రైతు రథం పథకం కిందగిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 40 ట్రాక్టర్లు కేటాయించాలని నిర్ణయించినట్టు మంత్రి సోమిరెడ్డి తెలిపారు. ఐటిడిఎల ద్వారా కొనుగోలు చేసే ట్రాక్టర్లకు మూడు లక్షలు, మూడున్నర లక్ష రూపాయల రాయితీ ఇవ్వనున్నట్టు వివరించారు. గిరిజన రైతుల పంటలు దళారుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి మండలంలో వివిధ పంటలకు సంబంధించి రెండు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంటల ఉత్పాదకతను భారీగా పెంచడాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటున్నామని, ఇందుకోసం రైతులకు ఏం కావాలన్నా అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి సోమిరెడ్డి చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులను ఇబ్బంది పెట్టాలనుకునే వ్యాపారులు, కంపెనీలను కూడా ఇకపై ఏ మాత్రం ఉపేక్షించబోమన్నారు. రైతులకు చెల్లించాల్సిన పరిహరం ఎగ్గొట్టిన కావేరి సీడ్స్ సంస్థకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు. రైతులకు పరిహారం ఇచ్చే వరకు ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ చేయొద్దని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎర్రగొండపాలం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి