ఆంధ్రప్రదేశ్‌

బాబుకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం ప్రకటనతో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనానికి గురైనట్లు కన్పించింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి హోదాపై కేంద్రం ప్రకటన చిరాకు తెప్పించినట్లు స్పష్టంగా కన్పించింది. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం చేరుకున్న బాబు మూడు గంటల వరకూ తన ప్రత్యేక బస్సులో ఉండిపోయారు. అది భోజన విరామసమయమని మంత్రులు చెప్పినా ఢిల్లీలోని పార్టీ ఎంపిలతో చర్చల్లోనే బాబు మునిగిపోయారు. అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన పలు ప్రారంభోత్సవాలు, సభల్లో బాబు అన్యమనస్కంగానే ప్రసంగించారు. నీరు-చెట్టు పనుల పరిశీలన, పంటసంజీవిని ప్రారంభ కార్యక్రమాల్లో బాబు ప్రసంగాలు ఆయన స్వరానికి తగ్గట్టుగా లేవనే చెప్పాలి. ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ఒప్పించలేకపోయామన్న ఆవేదన ఆయన ముఖంలో సుస్పష్టంగా కన్పించింది. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో కోడిరామ్మూర్తి స్టేడియం చేరుకున్నప్పటికీ కేంద్రం ఇచ్చిన షాక్ నుంచి బయటపడలేదనడానికి ఆ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చప్పగా సాగడమేకాకుండా, చెప్పిందే చెబుతూ ఒకే అంశాన్ని ప్రస్తావిస్తూ సాగదీయడం వెనుక ‘ప్రత్యేకహోదా’ చిరాకు సుస్పష్టంగా కన్పించింది. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ పెద్దలు, ఎంపితో ప్రత్యేకహోదా అంశంపై బాబు చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రప్రభుత్వం ప్రకటన నేపధ్యంలో రాష్ట్ర ప్రజల తరఫున చేపట్టాల్సిన ఉద్యమానికి కార్యాచరణ, విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహరచనలో బాబు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
కాళ్ళరిగేలా తిరిగినా..
విభజన చట్టంలో పొందుపర్చిన హామీల పరిష్కారం కోసం ఇప్పటి వరకూ 20 సార్లుకుపైగా ఢిల్లీకి కాళ్లరిగేలా వెళ్ళినా ఫలితం దక్కలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి శ్రీకాకుళంలోని సప్తగిరి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా పార్టీ సర్వసభ్యసమావేశంలో సిఎం ప్రసంగిస్తూ విభజన సమస్యలను కేడర్‌కు ఎకరవుపెట్టారు. ఆస్తులు తెలంగాణ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎలా మనగలుతుందని సూటిగా ప్రశ్నించారు. ఆస్తులు సమానంగా పంచాలని పదో షెడ్యూల్‌లో విద్యాసంస్థల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో అదే అన్నింటికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. తలసరి ఆదాయం తక్కువగా, అప్పులు ఎక్కువుగా ఉన్నప్పటికీ సంకల్పబలంతో ముందుకు సాగుతున్నామన్నారు.