ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర వేడుకగా మోదకొండమ్మ జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 5: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెనికగన్న పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించనున్నారు. విశాఖ ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరులో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మోదకొండమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర వేడుకగా గుర్తిస్తూ ప్రభుత్వం గత నెల 28న ఉత్తర్వులు జారీచేసింది. నవాంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో జరిగే జాతర్లలో పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవం తొలి స్థానాన్ని సంపాదించుకోవడంతో దీనికి ప్రభుత్వ గుర్తింపు లభించినట్టయింది. ఉత్తరాంధ్రలో వైభవంగా నిర్వహించే విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవం, అనకాపల్లి నూకాలమ్మ జాతర సరసన పాడేరు మోదకొండమ్మ జాతర నిలుస్తోందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచే కాకుండా పక్కనే ఉన్న ఒడిశా నుంచి లక్షలాది మంది భక్తుల మోదకొండమ్మ దర్శనానికి తరలివస్తుంటారు. గిరిజన, గిరిజనేతరుల ఇంటి ఇలవేల్పుగా కొలవబడుతున్న మోదకొండమ్మ అమ్మవారి పుట్టు పుర్వోత్తరాలు, అమ్మవారి మహిమలను గురించి పూర్వీకులు గొప్పగా చెబుతారు. సముద్రమట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉన్న పాడేరుకు సమీపాన మోదాపల్లి గ్రామం వద్ద మోదకొండమ్మ అమ్మవారు 1967వ సంవత్సరంలో వెలిసినట్టు చెబుతారు.