ఆంధ్రప్రదేశ్‌

కెజిహెచ్ నుంచి ఆంత్రాక్స్ రోగులు పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 5: ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న 19 మంది గిరిజనులు గురువారం తెల్లవారుజామున స్వగ్రామాలకు పారిపోయారు. ఒకేసారి ఇంతమంది రోగులు ఎలాంటి అనుమతి లేకుండా ఆసుపత్రి నుంచి పారిపోవడం వైద్యవర్గాలను కలవరపాటుకు గురిచేశాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా హుకుంపేట మండలం పనస్‌పుట్ గ్రామానికి చెందిన 19 మంది గిరిజనులు ఇటీవల ఆంత్రాక్స్ లక్షణాలతో కెజిహెచ్‌లో చేరారు. ఒకేసారి ఇంతమంది వ్యాధిబారిన పడి ఆసుపత్రిలో చేరడం ఇదే తొలిసారి. ఆసుపత్రి డెర్మాటాలజీ విభాగంలో వీరందరికీ ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల గ్వాలియర్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యనిపుణులు రోగులను పరీక్షించి నమూనాలు సేకరించారు. గ్రామాన్ని సైతం సందర్శించారు. మరో రెండు రోజుల్లో నివేదికలు రానున్న సమయంలో రోగులు ఆసుపత్రి నుంచి పారిపోవడం కలకలం రేపింది. పాడేరులో జరిగే మోదకొండమ్మ అమ్మవారి జాతరకు వెళ్తామని రోగులు బుధవారం సాయంత్రం నుంచి పలుసార్లు వైద్యులను కోరగా వారు నిరాకరించినట్లు సమాచారం. తెల్లవారుజామున చెప్పాపెట్టకుండా 19 మంది పారిపోయారు. వార్డుల తనిఖీకి వచ్చిన వైద్యులు ఆంత్రాక్స్ రోగులు కనిపించకపోవడంతో కంగారుపడి విషయాన్ని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంటనే పాడేరు ఐటిడిఎ పిఒకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఆయన హుటాహుటిన గొయ్యిగుంట, వెనె్నలకోట గ్రామాల్లో పర్యటించారు. కిల్లో శ్రావణి(5) తల్లి లక్ష్మిని విచారించగా సరైన వైద్యం అందిస్తున్నప్పటికీ భోజనం సరిపోలేదని, ఎండ వేడిమికి తట్టుకోలేక వైద్యులకు చెప్పకుండా వచ్చేసామని చెప్పింది.