ఆంధ్రప్రదేశ్‌

జల వనరులను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 5: పూర్వకాలంలో సాగునీరు, తాగునీరు విషయంలో ప్రజలు, పాలకులు ముందుచూపుతో వ్యవహరించిన కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, కానీ ఇప్పుడు పాలకులు, ప్రజలు జలాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నదీజలాలు, భూగర్భజలాలను సరిగా వినియోగించుకుంటే, వర్షం నీటిని సక్రమంగా ఒడిసిపట్టుకుంటే కరవురహిత ఆంధ్రప్రదేశ్‌గా మారుతుందన్నారు. నీరు-చెట్టు, ఎన్టీఆర్ జలసిరి, పంట సంజీవని కార్యక్రమాల విషయంలో వచ్చే 50రోజులు కష్టపడితే నీటిఎద్దడి అధిగమించవచ్చని అన్నారు. గురువారం ఉదయం విజయనగరం పట్టణంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో జలవనరులశాఖ అధ్వర్యంలో నిర్వహించిన నీరు-ప్రగతి సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధశాఖల అధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. సిఎం మాట్లాడుతూ విజయనగరం జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి వనరులు అపారంగా ఉన్నాయన్నారు. నాగావళి, సువర్ణముఖి, వేగావతి, చంపావతి నదుల నుంచి వర్షాకాలంలో జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, ఈ నదులను అనుసంధానం చేయటం ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని అన్ని చెరువులను నీటితో నింపేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా పంటలకు అవసరమైన నీరు అందిచటంతోపాటు భూగర్భజల మట్టం పెరుగుతుందని చెప్పారు. గతంలో విజయనగరం రాజులు కొన్ని గొలుసుకట్టు కట్టడాల వల్ల జిల్లాలో 175కు పైగా చెరువులకు ఒకదాని నుంచి మరొకటికి నీళ్లు అందుతున్నాయని, నదుల అనుసంధానం ద్వారా అన్ని చెరువులను గొలుసుకట్టు విధానంలోకి తీసుకురావలసిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నదులు, డొంకలు, గెడ్డల ఆధారంగా చెక్‌డ్యాంలు నిర్మించి జలసంరక్షణ చేపట్టాలని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే పనులో జాప్యం చేసే కాంట్రాక్టర్లను మార్చాలని స్పష్టం చేశారు. వ్యవసాయంతోపాటు పండ్లతోటల పెంపకం, చేపల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి ఎప్పుడు కరెంటు ఇస్తారో, తీసేస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ సరఫరాలో మిగులు చూపామని అన్నారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శరైతులుగా నియమించటంతో రాష్ట్రంలో వ్యవసాయం భ్రష్టుపట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అర్హులైన యువకులను ఎంపిఇఓలుగా నియమించి వారి ద్వారా రైతులకు ప్రయోజనం కలిగేలా చూసామన్నారు.