ఆంధ్రప్రదేశ్‌

కొల్లేరు లంకలో మళ్లీ రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 5: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంక గ్రామంలో వివాదాస్పద చేపల చెరువుల్లో పట్టుబడికి గ్రామస్థులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. న్యాయస్థానం స్టే కొనసాగుతున్న ఈ చెరువుల్లో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టరాదని అటవీ, పోలీసు శాఖ అధికార్లు అడ్డుకున్నారు. దీనితో ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాలిలావున్నాయి... ఏలూరు మండలం పరిధిలోని ప్రత్తికోళ్లలంక గ్రామంలో గత రెండు, మూడేళ్లుగా గ్రామానికి సంబంధించిన చెరువులకు సంబంధించి వివాదం సాగుతూనే ఉంది. గ్రామానికి చెందిన ఈ చెర్వులు అభయారణ్యం పరిధిలో ఉన్నాయన్న అంశంపై న్యాయస్థానం అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా స్టే విధించింది. ఈ నేపథ్యంలో గురువారం గ్రామానికి చెందిన సుమారు 260 ఎకరాల విస్తీర్ణంలోని దాదాపు 12 చెరువుల్లో చేపలు పట్టడానికి గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులతో పాటు పోలీసు బలగాలు కూడా భారీఎత్తున అక్కడ మోహరించాయి. మరోవైపు గ్రామస్థులు కూడా పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చేపల పట్టుబడికి ముందుగా చేసే తిరగేత అనే ప్రక్రియను గ్రామస్థులు చేపట్టారు. దీన్ని అటవీశాఖాధికారులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆ గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి తొలుత పోలీసులపై చిందులు తొక్కారు. అనంతరం అటవీశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. పరుషమైన వ్యాఖ్యలుచేశారు. చివరకు కలెక్టరు వద్దే వ్యవహారాన్ని తేల్చుకుందామని ప్రభాకర్ చెప్పటంతో పరిస్థితి సర్దుమణిగింది. ఈలోగా ఘటనాస్థలానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు కూడా చేరుకున్నారు. ఏలూరు డిఎస్పీ వెంకటేశ్వరరావు, ఏలూరు, పెదపాడు తహసిల్దార్లు ప్రసాద్, కుమార్‌లు గ్రామంలో పరిస్ధితిని సమీక్షించారు. కాగా అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి వెలగల వెంకటరెడ్డి ఫిర్యాదుపై 16మంది గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు.