ఆంధ్రప్రదేశ్‌

కోస్తా కోసం కర్నూలులో దీక్షలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 5: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో దీక్ష చేయడం ఏమిటని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. కర్నూలులో గురువారం ఆయన మాట్లాడుతూ రాయలసీమ కంటే ఎక్కువగా కృష్ణా డెల్టాకే తెలంగాణ ప్రాజెక్టులు ఇబ్బందులు సృష్టిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులను తమకు అనుకూలంగా చేసుకుని సిద్ధేశ్వరం ఆనకట్ట, గుండ్రేవుల జలాశయం, ఆర్డీఎస్ కుడి కాల్వను సాధించుకోవాల్సిన జగన్ కృష్ణా డెల్టా కోసమే దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలం జలాశయంలో 864 అడుగుల నీటి మట్టం స్థాయిలో సిద్ధేశ్వరం ఆనకట్టను నిర్మించుకోవడం, గుండ్రేవుల జలాశయాన్ని 20 టిఎంసీల నిల్వ సామర్థ్యంతో పూర్తి చేసుకోవడం, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఆధారంగా 4 టిఎంసీల ఆర్‌డిఎస్ కుడి కాలువ తవ్వడం రాయలసీమ ప్రాంతానికి అత్యవసరమని ఆయన అన్నారు. కృష్ణా డెల్టా కోసం ఇప్పటికే పట్టిసీమ పూర్తి చేశారని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత రైతులకు సాగునీటి సమస్య ఉండదని బైరెడ్డి తెలిపారు.