ఆంధ్రప్రదేశ్‌

పాఠ్యాంశంగా మస్తాన్‌బాబు జీవితచరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగం, మే 5: ప్రపంచ పర్వతారోహకులు మల్లి మస్తాన్‌బాబు జీవిత చరిత్రని రాష్ట్రప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది. 8వ తరగతి తెలుగు ఉపవాచకంలో ‘స్ఫూర్తిప్రదాతలు’ అనే శీర్షికతో పాఠ్యాంశంగా చేర్చింది. నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజన సంఘం గ్రామంలో అతని బాల్యం నుండి మొదలై విద్యాభ్యాసం, పర్వతారోహణ, పర్వతారోహణ చేస్తూ ప్రమాదవశాత్తు గత ఏడాది మార్చి 24న మృతిచెందిన విషయం వరకు క్లుప్తంగా పాఠ్యాంశంలో చేర్చారు. ఈ పాఠ్యాంశం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ ఎంతో ఉపయోగకరంగా, స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. 8వ తరగతి తెలుగు ఉపవాచకం పుస్తకంలో 16వ పాఠ్యాంశంగా 135వ పేజీ నుండి 142వ పేజీ వరకు మస్తాన్‌బాబు జీవితచరిత్రను ముద్రించారు. మస్తాన్‌బాబు బాల్యం, చదువుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. మల్లి మస్తాన్‌బాబు జీవితచరిత్రని పాఠ్యాంశంలో చేర్చిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆనందించారు. సంగం మండలం గాంధీజనసంఘం గ్రామంలో మస్తాన్‌బాబు తల్లి మల్లి సుబ్బమ్మ పుస్తకంలో పాఠ్యాంశాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు.