ఆంధ్రప్రదేశ్‌

రాలిన మామిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/ఏలూరు/కాకినాడ,మే 6:ఆంధ్రావనిలో శుక్రవారం కురిసిన భారీ వర్షం ఓ పక్క ఆనందాన్ని, మరోపక్క విషాదానే్న జనానికి మిగిల్చింది. గ్రీష్మతాపం నుంచి స్వల్ప ఉపశమనమన్న ఆనందమే తప్ప భయానక గాలులతో కూడిన భీకర వర్షం వల్ల భారీగానే నష్టం వాటిల్లింది. చేతికందే మామిడి నేల రాలడంతో రైతన్న డీలా పడ్డాడు. చెట్లు, కరెంట్ తీగెలు తెగిపడటంతో జనజీవనం స్తంభించింది. అనేక చోట్ల ఇళ్లలోకి నీరు రావడం, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో స్థానిక పరిస్థితులు భయానకంగా మారాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో పెను గాలులు, భారీ వర్షం వల్ల మూడు గంటల పాటు జన జీవనం స్తంభించింది. మొత్తం 51.6 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదయింది. పెను గాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడిపోగా విద్యుత్ వైర్లు తెగి పోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడి తోటల్లో చెట్లు, కొమ్మలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో డ్రైయిన్‌లు పొంగి ప్రవహించాయి. వాతావరణంలో ఒక్కసారిగా ఏర్పడిన మార్పుతో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతం చల్లబడింది. శుక్రవారం ఉదయం ఏడున్నర గంటలకు ప్రారంభమైన వర్షం రెండు గంటలపాటు కురిసింది. గాలులు కొద్దిసేపు మాత్రమే వీశాయి. అయితే ప్రస్తుత సీజనులో అంతంతమాత్రంగా ఉన్న మామిడి పంటకు వీచిన గాలులు, అకాల వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కేవలం 20 శాతం మామిడి కాయలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. చాలా తోటల్లో కాయలు ఇంకా పక్వానికి రావాల్సి ఉంది. మార్కెట్‌లో కూడా సరైన ధర లేకపోవటంతో ఈ నెల రెండో వారంలో కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తే ధర వస్తుందని రైతులు ఆశపడుతున్న తరుణంలో అకాల వర్షం, గాలులతో మామిడి కాయలు నేలకొరిగాయి. ఉత్పత్తిలో కనీసం పది నుండి 20 శాతం కాయలు గాలులకు రాలినట్లు రైతులు తెలిపారు. ఇదిలా ఉండగా కురిసిన వర్షాల వల్ల చెట్లకు ఉన్న కాయల్లో నాణ్యత పెరుగుతుందని, ఫలితంగా ధర కూడా వస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు. అకాల వర్షం రైతులకు కొద్ది మేర నష్టానే్న కలిగించింది.
గత కొద్ది కాలంగా భానుడి ప్రతాపంతో అల్లాడిన గోదావరి జిల్లాలకు తాజా వర్షాలు ఎంతో ఉపశమనమిచ్చాయి. శుక్రవారం తెల్లవారు జాము నుంచే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. మార్చి నెలాఖరు నుంచి 40డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలతో అవస్థలు పడ్డ వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజాజీవనం పులకరించింది. రెండు జిల్లాల్లో పలుప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా కథనాలు వెలువడ్డాయి. కరెంటు తీగెలు తెగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. అసలే ఈ ఏడాది మామిడి పంట అంతంత మాత్రంగానే ఉందని, ఇప్పుడు వర్షాలకు ఉన్నకాయలు రాలిపోవడం రైతాంగానికి తీవ్ర నిరాశే కలిగించింది.

చిత్రం... శుక్రవారం కృష్ణా జిల్లా నూజివీడులో అకాల వర్షానికి నేలరాలిన మామిడి కాయలు