ఆంధ్రప్రదేశ్‌

నీటి వాటా వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 6: రాష్ట్రానికి దామాష పద్ధతిన రావల్సిన కృష్ణా, గోదావరి జలాలను యథాతథంగా ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనిపై ఎంతటి పోరాటికైనా సిద్ధమని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు చెప్పారు. విజయవాడ శుక్రవారం జరిగిన నీరు ప్రగతి చర్చా గోష్ఠిలో చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రానికి రావల్సిన నదీ జలాలను ఏవిధంగానైనా సాధించుకుంటామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కృష్ణ, గోదావరి నదులపై అక్రమంగా ప్రాజెక్ట్‌లు నిర్మించడం వలన మన రాష్ట్రం నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నదుల ద్వారా వచ్చే నీటి కోసం రైతులు ఎదురు చూడకుండా, ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటిని సంరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం ఓ చారిత్రక విజయమని ఆయన అన్నారు. రికార్డు స్థాయిలో పట్టిసీమను పూర్తి చేశామని ఆయన తెలియచేశారు. వంశధార, నాగవళి నదులను, కృష్ణ, పెన్న నదులను అనుసంధానం చేస్తామని చంద్రబాబు తెలియచేశారు. సంగం బ్యారేజ్, సోమశిల, కండలేరుల వద్ద లిఫ్ట్ ద్వారా నీటిని తీసుకువెళ్లి కడప, చిత్తూరు జిల్లాల్లో నీటి ఎద్దడిని నివారిస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో 1250 ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆయన చెప్పారు. నీటి సంరక్షణ కోసం తానొక్కడినే పనిచేస్తే సరిపోదని, ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని ఆయన చెప్పారు. రైతులకు రెండో విడత రుణ విముక్తి కల్పించామని, భవిష్యత్‌లో రైతులకు ఎటువంటి కష్టం రానీయకుండా చూసుకుంటానని అన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఆయన తెలియచేశారు.
హోదాపై రాజీపడను
హోదాపై కేంద్ర వైఖరి బాధ కలుగుతోందని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విభజనను కోరుకోలేదని, అయినా జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనకపోయినా, రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందే వరకూ కేంద్రం అదనపు సాహకారాన్ని అందించాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. హోదాను తీసుకువచ్చేందుకు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించడం సరికాదని, ఒకవేళ విభస్తే సమ న్యాయం పాటించాలని కోరానని, కాంగ్రెస్ పార్టీ అవేవీ పాటించలేదని అన్నారు. యుద్ధ విమానాల్లో విభజన బిల్లును తెప్పించుకుని, వార్ రూంలో కూర్చుని దానిపై చర్చించి, పార్లమెంట్ తలుపులు మూసేసి బిల్లును ఆమోదించారని, అప్పుడు తాను పార్లమెంట్‌లోని అద్వాని చాంబర్‌లో ఉన్నానని చంద్రబాబు చెప్పారు.
chitram...
నీరు - ప్రగతి చర్చా గోష్ఠిలో మాట్లాడుతున్న చంద్రబాబు