ఆంధ్రప్రదేశ్‌

నిధులకు కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: నిధుల కోసం కటకటలాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు రోజుగడవడమే కష్టంగా మారింది. ఏ రోజుకారోజు ఆదాయాన్ని లెక్క వేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంనుండి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ముందస్తు ప్రణాళికలు వేసిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు నిధులు అందకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. దీనికి తోడు ఆదాయం కూడా అంతంత మాత్రంగా మారింది. వాణిజ్య పన్నుల శాఖ నుండి ఏప్రిల్ నెలలో 3692.22 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావించగా, 2589.38 కోట్లు మాత్రమే ఆదాయాన్ని పొందగలిగింది. అలాగే ఎక్సైజ్ శాఖ నుండి 567.72 కోట్ల ఆదాయానికి గానూ కేవలం 239.90 కోట్లు వచ్చింది. రిజిస్ట్రేషన్ -స్టాంపుల శాఖ నుండి 510.90 కోట్లు వస్తుందని భావించగా, 390.82 కోట్లు మాత్రమే వచ్చింది. రవాణా శాఖ నుండి 237.90 కోట్లు వస్తుందని భావించగా, 208.09 కోట్లు , గనుల శాఖ నుండి 168.16 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 101.50 కోట్లు మాత్రమే ఆదాయం దక్కింది. గత నెలలో ప్రణాళిక కింద 2433.00 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 4105 కోట్లు వెచ్చించగా, ఏప్రిల్‌లో మాత్రం కేవలం ప్రణాళిక కింద 1819 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 2407 కోట్లు వెచ్చించారు. అంటే దాదాపు 2300 కోట్లు తక్కువగా వెచ్చించినట్టు తెలిసింది. మొత్తం వ్యయం 10765 కోట్లు కాగా అందులో రెవిన్యూ వ్యయం 9750 కోట్లు, పెట్టుబడి వ్యయం 1009 కోట్లు ఉంది.
మే నెలలో పలు ఖర్చులు గట్టెక్కాలంటే కేంద్రం కనీసం ఐదు వేల కోట్ల రూపాయిలు మంజూరుచేస్తే తప్ప పరిస్థితిని అధిగమించలేమని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇంకో పక్క ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన వివిధ సంక్షేమ పథకాల హామీలు, రైతుల రుణమాఫీ రెండో విడత ఖర్చుతో పాటు స్వయం సహాయక బృందాల రుణ మాఫీ, కొత్త రాజధాని, వివిధ విద్యాసంస్థల కోసం రాష్ట్ర వాటా ఇతర ఖర్చులు అదనంగా ఉండనే ఉన్నాయి. వీటన్నింటికీ తోడు ఇటీవల రిక్రూట్‌చేసిన టీచర్ల నియామకాలు, త్వరలో ఎపిపిఎస్‌సి ద్వారా మరో 12వేల మంది నియామకాలు జరిగితే జీత భత్యాల భారం అపరిమితంగా పెరగనుందని చెబుతున్నారు.