ఆంధ్రప్రదేశ్‌

భూమాకు మంత్రి పదవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి మండలిలో స్థానం ఖాయమైనట్లు సమాచారం. ఆయనకు విద్యుత్, పౌర సరఫరాలశాఖలో ఏదోఒకదాన్ని కేటాయిస్తారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో మంత్రివర్గంలో సర్దుబాట్లు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగానే భూమా నాగిరెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆయన వర్గీయులు అంటున్నారు. కాగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సిఆర్‌డిఎకు ప్రత్యేకశాఖ ఏర్పాటు చేయనున్నట్లు అధికార పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. దీని బాధ్యతలను పురపాలకశాఖ మంత్రి నారాయణకు అప్పగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న పురపాలకశాఖను పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీతకు అప్పగిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే భూమా నాగిరెడ్డికి పౌరసరఫరాలశాఖ బాధ్యతలు కేటాయిస్తారని చర్చించుకుంటున్నారు. 5వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ఉన్నందున ఆలోపుగా భూమా నాగిరెడ్డిని మాత్రమే మంత్రి మండలిలో చేర్చుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న విద్యుత్‌శాఖను కేటాయించవచ్చని భావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం కాస్త ఆలస్యమైనా మంత్రివర్గంలో మార్పులు చేస్తారన్న అభిప్రాయం టిడిపి సీనియర్ నాయకుల్లో ఉంది. ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉందనీ, ప్రస్తుత మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలకవచ్చని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చించుకుంటున్నారని వారంటున్నారు.