ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమపై పట్టింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 8: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని రాష్ట్రం, కాదని పోలవరం అథారిటీ పేర్కొంటున్న నేపధ్యంలో నిధుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మాట ఎలా ఉన్నా నిధుల విడుదలలో స్పష్టత లభిస్తే పనులు మరింత పుంజుకునే అవకాశం ఉంది. పోలవరం పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుందని, అవసరమైతే నాబార్డు నిధులు తీసుకుని మరీ నిర్మిస్తామని కేంద్రం ఒకపక్క చెబుతోంది. ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం నుండి రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఎఐబిపి నిధుల విషయంలోను, పట్టిసీమ అంతర్భాగమా, కాదా అనే విషయంలోనూ పోలవరం అథారిటీ వద్ద ఇంకా చిక్కుముడి వీడలేదు. పోలవరం కోసం కేంద్రం నాబార్డు నిధులు అప్పుగా తీసుకుని 20 ఏళ్లలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంటోందని ఇటీవల అథారిటీ సిఇఒ అమరజిత్‌సింగ్ జిల్లాకు వచ్చినప్పుడు చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే పట్టిసీమను పోలవరంలో అంతర్భాగమని రాష్ట్రం చెబుతుంటే కాదని అథారిటీ అంటోంది. ఇప్పటివరకు పట్టిసీమకు ఖర్చు చేసిన నిధులను ఇచ్చేందుకు అథారిటీ అంగీకరించడం లేదు. పోలవరం పూర్తిస్థాయి నివేదిక (డిపిఆర్)లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం లేనందువల్ల నిధులిచ్చేది లేదని చెబుతోంది. రాష్ట్రం పట్టిసీమ కోసం రూ.1120 కోట్లు ఖర్చు చేసింది. ఈ నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. వీటిని నిర్ధారిస్తూ అథారిటీ నిధులు ఇవ్వాల్సి ఉందని కేంద్రానికి ధ్రువీకరించాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు రూ.2540 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు కేంద్రం రూ.645 మాత్రమే ఇచ్చింది. ఇప్పటివరకు పట్టిసీమతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.2540 కోట్లు వెచ్చించింది. దీనికి ఆడిట్ రిపోర్టు కూడా అథారిటీకి సమర్పించింది. అయితే పట్టిసీమ చిక్కుముడి మాత్రం వీడలేదు. కేంద్రం నుండి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలవనరుల శాఖ నుండి అనుమతి తెచ్చుకుంటే అభ్యంతరమేముంటుందని అథారిటీ చెబుతోంది. 2008-09లో ఎఐబిపి కింద కేంద్రం పోలవరానికి రూ.562 కోట్లు మంజూరు చేసింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత 2014-16 మధ్య రూ.850 కోట్లు ఇచ్చినట్టుగా కేంద్రమంత్రి పార్లమెంటులో వివరణ ఇచ్చారు. ఈ మేరకు పోలవరానికి సంబంధించి పొంతనలేని లెక్కలు వెలువడుతున్నాయి. వెచ్చించిన రూ.7171 కోట్లలో రాష్ట్రం ఖర్చు చేసిన రూ.1066 కోట్లు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే విచిత్రమేమిటంటే పనుల వేగవంతానికి ఒక్క 2015-16లోనే 600 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విషయంలో ఒకవైపు నాబార్డు సందేహాలు, మరోవైపు అథారిటీ చిక్కుముడులు వీడాల్సి ఉంది. ప్రస్తుతానికి పోలవరం పనులు శరవేగంగానే జరుగుతున్నా అథారిటీ నుండి సత్వరం నిధులు విడుదలైతే లక్ష్యం మేరకు పనులు పరుగెత్తే అవకాశం ఉంది.

టి శ్రీనివాస్